సినీ ఇండస్ట్రీపై రేవంత్ అసంతృప్తి.. బుజ్జగింపులకు దిగిన మెగాస్టార్ ? 

మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సినిమా ఇండస్ట్రీ పై అసంతృప్తితోనే ఉంటున్నారు.

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ తనకు అభినందనలు తెలిపేందుకు రాకపోవడం వంటి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేయడం , ఆ తర్వాత సినీ పెద్దలు వెళ్లి ఆయనతో భేటీ కావడం వంటిది జరిగాయి.

తాజాగా మరోసారి సినీ పరిశ్రమపై రేవంత్ అసంతృప్తి వ్యక చేశారు.తాజాగా ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు ఇస్తానంటూ తాను పెట్టిన ప్రతిపాదనపై సినీ పరిశ్రమ స్పందించలేదని,  అవార్డులు ఇస్తానని స్వయంగా చెబితే పట్టించుకోకపోవడం ఏమిటంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Revanths Displeasure With The Film Industry Is The Megastar, Congress, Tpcc, Co

గద్దర్ గారి జయంతి( Gaddars birthday ) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని , సినీ ప్రముఖులు బాధ్యత వహిస్తున్న వారు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకురావాలని తాను చెప్పిన పట్టించుకోలేదని రేవంత్ అన్నారు.ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు ప్రభుత్వాన్ని సంప్రదించలేదని , తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఒక అడుగు ముందుకేసింది.ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లాలని రేవంత్ కోరారు.

ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమపై రేవంత్ అసంతృప్తి తో ఉండడంతో,  వెంటనే మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు .

Revanths Displeasure With The Film Industry Is The Megastar, Congress, Tpcc, Co
Advertisement
Revanth's Displeasure With The Film Industry Is The Megastar, Congress, Tpcc, Co

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా రేవంత్ ను బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ,  సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత తెలుగు పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్విట్ చేశారు .స్వయంగా చిరంజీవి ఈ వ్యవహారంలో స్పందించడంతో మిగతా సినీ పెద్దలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి, సినీ పరిశ్రమపై రేవంత్ కు ఉన్న అసంతృప్తిని పోగొట్టి  గద్దర్ అవార్డుల విషయంలో కలిసి ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు