టాలీవుడ్ లో మళ్ళీ రిపీట్ అవుతున్న సూపర్ హిట్ జంటలు ఇవే!

టాలీవుడ్ లో రీల్ కపుల్స్ లో కొంత మంది జంటలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు.వారు మళ్ళీ మళ్ళీ కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటారు.

అందుకు కారణం ఆ జంటల మధ్య ఉండే కెమిస్ట్రీనే కారణం.అలాగే వారు నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే సూపర్ హిట్ జోడీ అనే ముద్ర పడుతుంది.

కానీ కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోయిన ఆ జంట మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.మరి మన టాలీవుడ్ లో కలిసి మళ్ళీ రిపీట్ కాబోతున్న సూపర్ హిట్ జోడీలు ఏంటంటే?

నాగ చైతన్య - సాయి పల్లవి :

అక్కినేని యువ హీరో నాగ చైతన్య,( Naga Chaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) జోడీ మళ్ళీ రిపీట్ కాబోతుంది.ఇప్పటికే ఈ కాంబో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది.

ఇక ఇప్పుడు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో ఈ అమ్మడే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

Advertisement

విజయ్ దళపతి - త్రిష :

ఈ జంట ఇప్పటికే కలిసి నటించారు.మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున్నారు.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాలో( Leo Movie ) విజయ్, త్రిష కలిసి నటించారు.

రామ్ చరణ్ - కియారా అద్వానీ :

ఈ జంట కూడా ఇప్పటికే కలిసి నటించారు.వినయ విధేయ రామ ( Vinaya Vidheya Rama ) సినిమాతో ఆకట్టుకున్న ఈ జోడీ ఈ సినిమా హిట్ అవ్వకపోయిన మరోసారి రిపీట్ కాబోతుంది.శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ లో( Game Changer ) ఈ జంట మళ్ళీ కలిసి నటిస్తున్నారు.

చిరంజీవి - అనుష్క :

వీరిద్దరూ కూడా కలిసి నటించారు.మళ్ళీ మెగాస్టార్,( Chiranjeevi ) అనుష్క( Anushka ) మెగా 157 లో కలిసి నటించనున్నట్టు టాక్.

రవితేజ - శ్రీలీల :

ఈ జంట ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది.ఇక ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు