తిరుమల వెంకన్నకు రికార్డ్ స్థాయి ఆదాయం..

ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.

దాదాపు చాలా మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.

మరి కొంత మంది భక్తులు స్వామి వారి హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు.కొంత మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

మంగళవారం రోజు తిరుమల పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా ఉంది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntham Q Complex) దగ్గర ఉన్న ఐదు కంపార్ట్మెంట్లలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు.

సర్వ దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ముఖ్య అధికారులు వెల్లడించారు.ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్ లోకి వచ్చినా భక్తులకు దాదాపు 24 గంటల సమయం స్వామి వారి దర్శనానికి పడుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.సోమవారం రోజు తిరుమల శ్రీవారిని దాదాపు 68,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం.ముఖ్యంగా చెప్పాలంటే వీరి లో దాదాపు 28,000 మంది భక్తులు తలనీలాలను సమర్పించి శ్రీ వారి మొక్కులు తీర్చుకున్నారు.సోమవారం ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు 5.65 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.ఈ మధ్య కాలంలో ఇదే అత్యధిక ఆదాయం అని తిరుమల దేవస్థానం ముఖ్య అధికారులు వెల్లడించారు.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు