Ravi Teja : ఆ విషయంలో రజనీకాంత్ కంటే రవితేజనే తోపు.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మామూలుగా ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి మామూలుగా ఉండదు.

చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు చాలా వరకు సినిమాలు శుక్రవారం ఎక్కువగా విడుదల అవుతూ ఉంటాయి.

ఇక నేడు కూడా రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.అందులో రవితేజ( Ravi Teja ) హీరోగా నటించిన ఈగల్ సినిమా ( Eagle movie )పేరే ఎక్కువగా వినిపిస్తోంది.

అలాగే మరో సినిమా తమిళ హీరో రజనీకాంత్ నటించిన లాల్ సలామ్( Lal Salaam ).రెండు సినిమాలు రెండు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి.అయితే నిజం చెప్పాలంటే నేడు ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న మాటే కానీ, కొంచెం కూడా బజ్ లేదు.

Raviteja Eagle Ovartake Rajini Lal Salaam

కనీసం రవితేజ ఈగల్ రిలీజ్ అవుతుంది అన్న విషయమైనా తెలుసు కానీ, అసలు రజినీకాంత్ ( Rajinikanth )సినిమా రేపు రిలీజ్ అవుతుందన్న విషయమే చాలామంది ప్రేక్షకులకు అస్సలు తెలియదు.అయితే మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతికి రావాల్సి ఉండగా సోలో రిలీజ్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ మాట ఇవ్వడంతో వెనక్కి తగ్గాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఫిల్మ్ ఛాంబర్ ఫిబ్రవరి 9 న ఈగల్ కు ఇచ్చింది.

Advertisement
Raviteja Eagle Ovartake Rajini Lal Salaam-Ravi Teja : ఆ విషయంలో

ఇక డబ్బింగ్ సినిమాగా లాల్ సలాం రిలీజ్ అవుతుంది.ఎంత డబ్బింగ్ అన్నా కూడా రజిని సినిమా అంటే వుండే ఊపు, హైప్ ఏది ఈ సినిమాకు లేదు.

Raviteja Eagle Ovartake Rajini Lal Salaam

మూవీ మేకర్స్ సైతం తమిళ్ లో చేసినంత ప్రమోషన్స్ తెలుగులో చేయలేదు.ఇక బుకింగ్స్ లో రవితేజ రజిని ఓవర్ టేక్ చేశాడు.లాల్ సలాం కన్నా ఈగల్ ఎక్కువ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది.

ఇక రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటే మునుపెన్నడూ చూడని ఊర మాస్ అవతార్ లో రవితేజ కనిపిస్తున్నాడు.ఈ సినిమాపై రవితేజ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఇక లాల్ సలాం లో రజిని మొయిద్దీన్ భాయ్ గా కనిపించనున్నాడు.రజినీ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఈ సినిమాకు దర్శకత్వం రజిని కూతురు సౌందర్య కావడం విశేషం.మరి రెండు సినిమాలలో ఏ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు