రవితేజ మరో సినిమా ఓకే..!

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలు చేస్తున్నాడు.క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఖిలాడితో మళ్లీ నిరాశపరచాడు.

ఇక రాబోతున్న రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నారు.ఈ సీనిమాల తర్వాత రవితేజ మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.

Raviteja Another Movie Signed , Dhamaka , Karthik Ghattamaneni , Mass Maharaj

సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని డైరక్షన్ లో రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతుందట.కెమెరా మెన్ గానే కాదు నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమాని డైరెక్ట్ చేశాడు కార్తిక్ ఘట్టమనేని.

ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మెగా ఫోన్ పడుతున్నాడు.కార్తిక్ చెప్పిన కథకు రవితేజ ఫిదా అయ్యారట.

Advertisement

కథ ఓకే అవడమే ఆలస్యం వెంటనే సినిమా చేసేద్దామని చెప్పారట.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.

ఈ సినిమాను ఓ బడా బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తుంది.రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని చెప్పుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుండగా ధమాకా, రావణాసుర సినిమాలు కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు రవితేజ.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు