గోపీచంద్, అల్లరి నరేష్ సినిమాలకు బెస్ట్ విషెష్ చెప్పిన మాస్ రాజా!

మాస్ రాజా రవితేజ ( Ravi Teja ).ఈయన తన తోటి నటీనటులను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడు.

ఈసారి కూడా తనవంతు సహాయం చేసాడు.ఇటీవలే వరుసగా రెండు హిట్స్, ఒక యావరేజ్ హిట్ అందుకున్న మాస్ రాజా ప్రజెంట్ తన కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్నాడు.

వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.

Ravi Teja Best Wishes To Ugram And Ramabanam, Ravi Teja, Ugram, Ramabanam, To

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే ఈయన తన తోటి హీరోలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.తన నుండి తనవంతుగా టాలీవుడ్ హీరోలకు సక్సెస్ రావాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement
Ravi Teja Best Wishes To Ugram And Ramabanam, Ravi Teja, Ugram, Ramabanam, To

ఈ రోజు టాలీవుడ్ లో బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడబోతున్న విషయం తెలిసిందే.

Ravi Teja Best Wishes To Ugram And Ramabanam, Ravi Teja, Ugram, Ramabanam, To

గోపీచంద్ ( Gopichand ) రామబాణం ( Ramabanam ) సినిమాతో, అల్లరి నరేష్ (Allari Naresh) ఉగ్రం ( Ugram ) సినిమాతో ఈ రోజు తమ అదృష్టాన్ని పరీక్షించు కోవాలని బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు.ఈ రెండు సినిమాల కోసం మేకర్స్ గత కొన్ని రోజులుగా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ ఆడియెన్స్ లో అటెన్షన్ అయితే సంపాదించారు.మరి ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Ravi Teja Best Wishes To Ugram And Ramabanam, Ravi Teja, Ugram, Ramabanam, To

మరి మాస్ రాజా రవితేజ కూడా తన తోటి హీరోలకు ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ రావాలని కోరుతూ అల్లరి నరేష్, గోపీచంద్ లకు బెస్ట్ విషెష్ అందించాడు.రవితేజ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.చూడాలి మరి గోపీచంద్, అల్లరి నరేష్ ఈ సినిమాలతో అయిన ప్లాప్స్ వదిలేసి హిట్స్ బాట పడతారో లేదో.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు