ధమాకా లొకేషన్ పిక్ వైరల్.. స్టైలిష్ లుక్ లో మాస్ రాజా!

మాస్ మహారాజా ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.

ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.

ఇటీవలే శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వచ్చి హిట్ అవ్వలేదు.దీంతో మాస్ రాజా నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.

ప్రెజెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇందులో రవితేజకు జంటగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ఒక స్టిల్ బయటకు వచ్చింది.ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ ఫోటో కొద్దీ సేపటి క్రితమే ఆన్ లొకేషన్స్ నుండి బయటకు వచ్చింది.ఈ సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ క్రమంలోనే షూట్ స్పాట్ నుండి ఒక ఫోటో బయటకు రాగా అది కాస్త సోషల్ మాధ్యమాల్లో బాగా షేర్ అవుతుంది.

ఈ వైరల్ అవుతున్న ఫొటోలో శ్రీలీలతో పాటు మాస్ రాజా రవితేజ, డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో పాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంకా టీమ్ సభ్యులు ఉన్నారు.ఈ ఫొటోలో శ్రీలీల లంగా ఓణీలో ముద్దుగా కనిపిస్తుండగా.మాస్ రాజా స్టైలిష్ లుక్ తో కనిపించి ఆకట్టు కుంటున్నాడు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఈ సినిమా కోసం టీమ్ మొత్తం బాగా కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది.చూడాలి మరీ ఈ సినిమా ఎంత బాగా ఆకట్టు కుంటుందో.

Advertisement

తాజా వార్తలు