విజయేంద్ర ప్రసాద్ సీతలో రావణుడుగా రణవీర్ సింగ్

స్టార్ రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ ఇమేజ్ ఇప్పుడు ఇండియన్ వైడ్ అయ్యింది.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ తో కూడిన కొత్త కథల కోసం అతని వద్దకే వస్తున్నారు.

బజరంగీ భాయ్ జాన్, మణికర్ణిక సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ కథలు అందించి బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నారు.ఈ నేపధ్యంలో అతని కథలకి అక్కడ డిమాండ్ భాగా పెరిగింది.

ప్రస్తుతం కంగనా కోసం కాశ్మీర్ క్వీన్ స్టొరీని సిద్ధం చేశారు.దీనిని తన దర్శకత్వంలోనే స్టార్ట్ చేయడానికి కంగనా రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే మరో వైపు రామాయణం బేస్ చేసుకొని సీత అనే టైటిల్ తో ఒక మూవీని హిందీలో ఎనౌన్స్ చేశారు.దీనికి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు.

Advertisement

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీ తెరకెక్కుతుంది.సీతదేవి స్టొరీలో ఇప్పటి వరకు ఎవరూ చూడని కోణాన్ని ఈ మూవీలో ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.

అలౌకిక దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్ నిర్మిస్తుంది.కంప్లీట్ మోషన్ క్యాప్చర్ లోనే ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు.

ప్రస్తుతం ఇందులో టైటిల్ రోల్ సీత పాత్ర కోసం హీరోయిన్ ఎంపికతో పాటు రావణుడు పాత్ర ఎంపికపై దర్శకుడు దృష్టి పెట్టాడు.అలియా భట్, కరీనా కపూర్ ల పేర్లు ప్రముఖంగా టైటిల్ రోల్ కోసం వినిపిస్తున్నాయి.

కరీనా కపూర్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.ఇక రావణుడు పాత్ర సినిమాలో చాల కీలకంగా ఉంటుందని.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

కొంత హీరోయిక్ ఎలివేషన్ కూడా ఆ క్యారెక్టర్ లో ఉండబోతుందని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ని ఎంపిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని బోగట్టా.

Advertisement

ఇప్పటికే అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది.త్వరలో ఈ క్యాస్టింగ్ ఒక కొలిక్కి వస్తే షూటింగ్ ప్లాన్ చేసుకోవడానికి దర్శకుడు సిద్ధం అవుతున్నారని సమాచారం.

తాజా వార్తలు