నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు?

తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈ తరం ప్రేక్షకులకు జయప్రద గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఇచ్చే గుర్తుపట్టేస్తారు.

అప్పట్లో తన అందం అభినయం నటనతో కొన్నేళ్ల పాటు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.అంతేకాకుండా టాలీవుడ్ లో అగ్ర హీరోలు అయినా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది జయప్రద.

సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా విజయం సాధించింది.ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి జయప్రద హాజరయ్యింది.

ఈ నేపథ్యంలోనే జయప్రద కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఉంది.అదేమిటంటే జయప్రదకు కోర్టు షాక్ ఇస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది ఉత్తరప్రదేశ్ రాంపూర్ కు చెందిన ప్రత్యేక కోర్టు జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీచేసి ఆమెకు షాకిచ్చింది.

Advertisement
Rampur Special Court Issues Non Bailable Arrest Warrant Against Senior Actress J

ఎందుకంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణ సందర్భంగా జయప్రద కోర్టుకు హాజరు కాలేకపోయింది.

Rampur Special Court Issues Non Bailable Arrest Warrant Against Senior Actress J

దీంతో రాంపూర్ ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారింట్లో జారీ చేసింది.ఈ క్రమంలోనే రాంపూర్ కు చెందిన ప్రభుత్వ న్యాయవాది అమర్నాథ్ తివారి మాట్లాడుతూ.విచారణ సమయంలో మాజీ ఎంపీ నటి జయప్రద వరుసగా హాజరు కాలేదు.

దీంతో కోర్టు జయప్రద తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ కారణంగా మాజీ ఎంపీపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదను కోర్టులో హాజరు పరిచాలని రాంపూర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ను ఈ సందర్భంగా కోర్టును ఆదేశించింది.తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది అని చెప్పుకొచ్చారు అమర్నాథ్ తివారి.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

.

Advertisement

తాజా వార్తలు