కరోనాపై లోక్ సభలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా కీలక ప్రకటన చేశారు.కరోనా ముప్పు ఇంకా పోలేదన్నారు.కొత్త వేరియంట్ బీఎఫ్.7 పై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.రాష్ట్రాలు జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచాలన్నారు.ఎయిర్ పోర్టుల్లో ర్యాండమ్ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు.కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.