ప్రభాస్ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్.. సాధ్యమేనా?

టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.

దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

ఇందులో ప్రభాస్ సరిసన కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో 2023 జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇందులో సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త తెగ వైరల్ అవుతోంది.కాగా ప్రభాస్ నటించిన ఈ తాజా చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరక్కుతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇందులో రాముడిగా ప్రభాస్,సీతాదేవిగా కృతి సనన్,రావణుడిగా సైఫ్ అలీఖాన్,లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు అన్న విషయం తెలిసిందే.అలాగే తాజాగా అందిన సమాచారం ప్రకారం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కెమియో రోల్లో కనిపించబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అది కూడా సీతా స్వయంవరంలో శివ ధనుర్భంగం తర్వాత రాముడిని సవాల్ చేసే పరశురాముడి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

ఆది పురుష్ సినిమాలో చాలా పవర్‌ఫుల్ పాత్ర కాబట్టి ఈ రోల్‌ని ఎవరైనా స్టార్ హీరోతో చేయిస్తే బాగుటుందని ఫైనల్‌గా ఆ క్యారెక్టర్ చేసేందకు రామ్ చరణ్ అంగీకరించినట్టు సమాచారం.అయితే త్వరలోనే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇకపోతే హీరో ప్రభాస్ విషయానికి వస్తే.

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరిర్ పరంగా దూసుకుపోతున్నారు.ప్రభాస్ కీ ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ప్రభాస్ కీ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల నిర్మాతలు కూడా ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు