రాజాసింగ్ స‌స్పెన్ష‌న్ పెద్ద డ్రామాః మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స‌స్పెన్ష‌న్ పెద్ద డ్రామా అని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు.కేంద్ర నాయ‌కత్వ‌మే రాజాసింగ్ తో అలా మాట్లాడించింద‌ని ఆరోపించారు.

అనంత‌రం పార్టీ నుండి స‌స్పెండ్ చేసిన‌ట్టు డ్రామా ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు.తెలంగాణ బీజేపీ నేత‌ల కుట్ర వెనుక కేంద్ర పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఏ ద‌ర్యాప్తు సంస్థ చెప్పింద‌ని లిక్క‌ర్ స్కాంపై మాట్లాడుతున్నార‌ని ప్ర‌శ్నించారు.

అనంత‌రం బెంగాల్ త‌ర‌హా రాజ‌కీయం తెలంగాణ‌లో న‌డ‌వ‌ద‌ని సూచించారు.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు