Radhika Sarath Kumar: చనిపోయే చివరి వరకు నన్ను సీరియస్ గానే చూశారు.. జయలలితపై నటి రాధిక వైరల్ కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ రాధిక శరత్ కుమార్( Radhika Sarath Kumar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె రెండు తరాల ప్రేక్షకులకు సుపరిచితమే.

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాధిక ఆ తర్వాత కాలంలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా నటించి మెప్పించింది.

బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది రాధిక.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె స్మిత( Smita ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న నిజం కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాధిక తో పాటు సుప్రియ స్వప్న దత్ లు కూడా పాల్గొన్నారు.

Radhika Shares Interesting Facts About Politial Entry
Advertisement
Radhika Shares Interesting Facts About Politial Entry-Radhika Sarath Kumar: చ

ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత( Jayalalitha ) గురించి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.

జీవితంలో ఇప్పటివరకు ఎన్నో విషయాలను నేర్చుకున్నాను.జీవితం ఒక ప్రయాణం.

ప్రతిక్షణం ఎంజాయ్‌ చేయాలని తెలుసుకున్నాను.ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఎక్కువగా ఆలోచించడం మానేశాను.

అనుకోకుండా నటి అయ్యాను.నేను చేసిన మొదటి తెలుగు సినిమా న్యాయం కావాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు తెలుగు రాదు.

Radhika Shares Interesting Facts About Politial Entry
Advertisement

శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాను.నేర్చుకున్న ప్రతి విషయాన్ని చక్కగా పాటిస్తే తప్పకుండా విజయం దక్కుతుందని తెలుసుకున్నాను.రాజకీయ నాయకురాలు కావాలని అనుకోలేదు.

అది కూడా అనుకోకుండా జరిగిపోయింది.అప్పట్లో డీఎంకే అగ్రనేత కరుణానిధి కుటుంబంతో నాకు సత్సంబంధాలు ఉండేవి.

ఒకసారి ఆయన నన్ను కలిసి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేయమన్నారు.ఆ విషయం తెలిసిన తర్వాత నుంచి చివరి వరకూ నన్ను కలిసిన ప్రతిసారీ జయ ఒక సీరియస్‌ లుక్‌ పెట్టి.

ఏంటమ్మా ఎలా ఉన్నావు? అని అడిగేవారు.రాజకీయపరంగా నా భర్త శరత్‌ కుమార్‌తో మైత్రి కలిగి ఉన్నప్పటికీ ఆమె నన్ను సీరియస్‌గానే చూసేవారు.

ఆమెతో అంత ఈజీ కాదు.ఆమె ఏదీ మర్చిపోరు అంటూ రాధిక నవ్వులు పూయించారు.

తాజా వార్తలు