19 అక్టోబర్ న ఉప్పు నింపిన గాజు సీసాను ఇంట్లో అక్కడ పెడితే?

ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.వంటల్లో చిటికెడు ఉప్పు వేస్తే ఆ వంటకు ఎంతో రుచి వస్తుంది.

అయితే ఆధ్యాత్మిక నిపుణులు ఉప్పు అనేది మన జీవితాల్లో సుఖ సంతోషాలను నింపుతుందని అంటున్నారు.అది ఎలాగో చూద్దాం.1.స్నానం చేసే గదిలో ఒక మూల ఉప్పును ఉంచితె వాస్తు దోషం ఉండదట.

చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు.వాస్తు మాట ఎలా ఉన్నా క్రిమి కీటకాలు మాత్రం స్నానాల గదికి చేరవు.2.రాహువు కారణంగా వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోకి రాకుండా ఉండాలంటే ఒక బౌల్ లో ఉప్పు వేసి పెట్టాలి.3.మన పెద్దవారు పిల్లలకు దిష్టి తీయటం చూస్తూనే ఉంటాం.

దిష్టి తగిలిందని అనిపిస్తే గుప్పెడు ఉప్పుని తీసుకోని దిష్టి తగిలిన వారి చుట్టూ మూడు సార్లు తిప్పి పడేస్తారు.అలా చేస్తే దిష్టి పోతుందని నమ్మకం.

Advertisement

4.ఎర్రటి వస్త్రంలో గుప్పెడు ఉప్పు పోసి మూట కట్టి వ్యాపార స్థలంలో పెడితే వ్యాపారంలో లాభాలు వస్తాయి.5.రాత్రి పడుకొనే ముందు ఉప్పు నీటితో కాళ్ళు, చేతులు కడుక్కుంటే మంచి నిద్ర పడుతుంది.6.అక్టోబర్ 19 దీపావళి రోజున ఉప్పు నింపిన గాజు సీసాని ఇంట్లో ఎదో ఒక మూల లేదా బాత్ రూమ్ లో పెడితే నెగటివ్ ఎనర్జీలు బయటకు పోయి లక్ష్మి దేవి ఇంటిలో కొలువై ఉంటుంది.

మన ఇంటిలో లక్ష్మి దేవి కొలువై ఉంటే సిరి సంపదలతో సంతోషంగా ఉంటాం.

Advertisement

తాజా వార్తలు