విజయసాయి పై వార్ డిక్లేర్ చేసిన పురందేశ్వరి

అదికార వైసీపీ పార్టీలో జగన్ నెంబర్ 1 అయితే విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy )నెంబర్ 2 అంటారు.

గత కొన్ని దశాబ్దాలుగా వై ఎస్ ఫామిలి కి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి గా పేరుపొందిన విజయ్ సాయి రెడ్డి జగన్ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ తన కనుసన్నల లోనే జరుగుతాయని చెప్తారు .

అంతేకాకుండా జగన్ కంపెనీలోకి పెట్టుబడులు వెల్లువ రావడానికి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న క్విడ్ ప్రోకో వ్యవహారాలు కూడా దగ్గరుండి విజయసాయిరెడ్డి నడిపించాడని కూడా చెప్తారు .అందుకే అక్రమాస్తుల కేసులో జగన్ తోజైలు శిక్ష కూడా అనుభవించిన విజయసాయిరెడ్డిని జగన్ కు అత్యంత నమ్మకస్తుడు గా చేబహుటారు .అలాంటి విజయ సాయి రెడ్డిని బిజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది .

Purandeshwari Declared War On Vijayasai , Vijayasai Reddy ,purandeswari , Ycp

వీరిద్దరి మధ్య గొడవ ఎలా మొదలయ్యిందో తెలియదు గాని ఇప్పుడు విజయ సి తో పాటు ముఖ్య మంత్రి జగన్ ( CM jagan )పై ఆమె సుప్రీం కోర్టు కు లేఖ రాశారు .గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్ తో పాటు విజయసాయిరెడ్డి బెయిల్ పైనే బయట ఉంటున్నారని, వారి మీద ఉన్న కేసులు అతి తీవ్రమైనవని ,న్యాయవ్యవస్థలోని కొన్ని లూప్ హోల్స్ను ను అడ్డుపెట్టుకొని వీరు వాయిదాలపై వాయిదాల కోరుతూ బయట గడుపుతున్నారని ప్రభుత్వంలో అత్యంత కీలకమైన స్థానంలో వీరు కొనసాగటం వల్ల ప్రజల హక్కులకు భంగం కలుగుతుందంటూ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బిజెపి అధ్యక్షురాలు లేఖ రాయడం కలకలం రేపింది .

Purandeshwari Declared War On Vijayasai , Vijayasai Reddy ,purandeswari , Ycp

గత కొన్ని రోజులుగా విజయ సాయి రెడ్డి Vs పురందేశ్వరి మధ్య ట్విటర్ వేదికగా హీట్ వార్ నడుస్తుంది.పురుందేశ్వరి టిడిపి ఏజెంట్ లాగా పనిచేస్తున్నారని , బిజెపి ప్రయోజనాలను టిడిపి కోసం తాకట్టుపడుతున్నారని విజయసాయిరెడ్డి వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.అంతేకాకుండా ఆమె ఎయిర్ ఇండియా సంస్థ అమ్మకం వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించి భారీగా లబ్ధి పొందారని ఆ డబ్బులతో హైదరాబాదులో కొన్ని నిర్మాణాలను కూడాచేస్తున్నారని కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Advertisement
Purandeshwari Declared War On Vijayasai , Vijayasai Reddy ,Purandeswari , YCP

దాంతో వీరిద్దరి మధ్య హీట్ పీక్ స్టేజికి చెరినట్లుగా తెలుస్తుంది .ఇప్పటికే జగన్ కేసుల విషయంపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇప్పుడు పురందేశ్వరి కూడా కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే పురందేశ్వరి లేక ఆమె వ్యక్తిగతమా లేక పార్టీ నిర్ణయమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.అయితే కేంద్ర బిజెపి పెద్దలు జగన్తో స్నేహంగా ఉంటారు అన్న విశ్లేషణలు ఉన్నాయి.

మరి ఇప్పుడు పురందేశ్వరి( Purandeswari ) లేఖ పై బిజెపి అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి .

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు