భార్య కళ్ళలో కారం కొట్టిన శాడిస్టు భర్త..!

అబ్బబ.ఈ మగాళ్లు మృగాళ్ళుగా మారిపోయి చాలా కాలం అయ్యింది.

ఎప్పుడు ఏ ఆడపిల్లతో అమానుషంగా ప్రవర్తిస్తారో చెప్పలేని పరిస్థితి.

ప్రేమిస్తారు.

ప్రేమించిన కొద్దికాలానికే అనుమానిస్తారు.ఇంకా పెళ్లి చేసుకుంటే చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు శాడిస్టు భర్తలు.

ఈ తరహాలోనే ఓ శాడిస్టు భర్త తన శాడిజాన్ని చూపించాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Advertisement

షార్జాలో భార్య అనుకోకుండా చిన్న తప్పు చేసింది.అంతే ఆ భర్త ఆమె కళ్లల్లో కారం కొట్టాడు.

అంత తప్పు ఏంటి అనుకుంటున్నారా? పని తొందరలో అనుకోకుండా అన్నంలో ఉప్పుకు బదులు చక్కెర వేసింది.

అదే పెద్ద తప్పు అయ్యింది ఆ నీచుడికి.ఆహారంలో విషం పెట్టి నన్ను చంపేయాలని చూస్తావా? అంటూ భార్య రెండు కళ్లను కారంతో నింపేశాడు ఆ శాడిస్ట్ భర్త.దీంతో బాధితురాలికి ఒక కంటిచూపు పోయింది.

కళ్ళలో కారం కొట్టడమే కాదు చేతలతో హిమిసించాడు కూడా.ఈ కేసు తాజాగా షార్జా కోర్టులో విచారణకు వచ్చింది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
క్షమాపణ చెబితే సరిపోతుందా.. హీరోయిన్ అనన్య నగళ్ల కామెంట్స్ వైరల్!

అయితే ఆ విచారణలో ఆమె మాట్లాడుతూ.పెళ్ళై 12 ఏళ్ళు అయ్యింది అని.పెళ్లి జరిగిన సమయం నుండి భర్త అనుమానంతో ఆమెను తీవ్రంగా హింసిస్తున్నాడు అని.ఇప్పుడు చిన్న తప్పుకు ఇలా కళ్ళలో కారం కొట్టి కంటి చూపు పోగొట్టాడని ఆమె వాపోయింది.అయితే ప్రస్తుతం ఈ కేసు షార్జా కోర్టులో విచారణలో ఉంది.

Advertisement

మరి విచారణాంతరం భర్తకు ఏలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.

తాజా వార్తలు