హద్దులు మీరుతున్న సైనిక పాలన.. మయన్మార్‌లో కొనసాగుతున్న అరాచకం.. ?

మయన్మార్ లో దాదాపు రెండు నెలలుగా సైనిక పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ప్రజలపై అణచివేత ధోరణిని కొనసాగిస్తుంది అక్కడి సైనిక ప్రభుత్వం.

ఈ క్రమంలో తీవ్రంగా చెలరేగుతున్న ఆందోళనలో నిరసనకారుల పై సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన నివేదికలో తేలింది.

కేవలం తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది చనిపోయారని, నిన్న ఒక్క శనివారమే 114 మంది ఆందోళనకారులు సైన్యం తూటాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపోతే సైనికుల తూటాలకు బలైన వారిలో అత్యధికంగా చిన్న పిల్లలే ఉన్నారని అక్కడి మీడియా వెల్లడించింది.

Myanmar, Provocative, Army Forces, Kill, Deadliest-హద్దులు మీ�

ఇదిలా ఉండగా సైనిక తిరుబాటును వ్యతిరేకిస్తూ యమన్మార్ దేశ ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ప్రతి రోజూ ప్రజలు ఆందోళనలు చేయడం, సాయుధ బలగాలు వారిపై దాడి చేసి అణచివేయడం ఆ సైన్యానికి ఒక అలవాటుగా మారింది.

ఇలా రోజు రోజుకు అత్యంత దారుణంగా వ్యవహరిస్తోన్న సైనిక ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని రక్షించి, ప్రజలను కాపాడటానికే ప్రయత్నిస్తున్నామని, తన చర్యలను సమర్ధించుకుంటు హద్దులు మీరుతుందని అంటున్నారు.

Advertisement
ఈగ సినిమాకు సీక్వెల్ వస్తోందట.. అసలు ట్విస్ట్ తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!

తాజా వార్తలు