గ‌ర్భిణీలు రోజూ ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన పోష‌కాలేంటో తెలుసా?

పెళ్లైన ప్ర‌తి మ‌హిళా ప్రెగ్నెన్సీని ఓ గొప్ప వ‌రంలా భావిస్తుంది.అయితే మిగిలిన స‌మ‌యాల‌తో పోలిస్తే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

అనేక నియ‌మాల‌ను పాటించాలి.అలాగే ప్ర‌తి రోజూ ఖ‌చ్చితంగా కొన్ని పోష‌కాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ పోష‌కాలు ఏంటీ.? అవి ఏ ఏ ఆహారాల్లో ఉంటాయి.? వంటి విష‌యాలు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఐర‌న్‌.గ‌ర్భిణీల‌కు కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఇది ఒక‌టి.ఐర‌న్ లేకపోతే ర‌క్త హీన‌త ఏర్ప‌డుతుంది.

Advertisement

దాంతో నీర‌సం, అల‌స‌ట, త‌ల నొప్పి వంటివి పెరిగి పోతాయి.అకాల ప్ర‌స‌వం, పుట్ట‌బోయే బిడ్డ‌లో లోపాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

అందుకే ఐర‌న్ పుష్క‌లంగా ఉండే ఖ‌ర్జూరాలు, పుచ్చ గింజ‌లు, పాల‌కూర‌, ఓట్స్‌, ఎండు ద్రాక్ష‌లు వంటివి తీసుకోవాలి.

అలాగే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో విటమిన్ డి కూడా ఎంతో అవ‌స‌రం.త‌ల్లీ, బిడ్డ‌ల ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను బ‌ల‌ప‌రిచి.రోగాలు ద‌రి చేర‌కూడ‌దంటే విట‌మిన్ డి ఉండే గుడ్లు, పాలు, పెరుగు, చేప‌లు, బ‌ఠాణీలు, పుట్ట‌గొడుగులు వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవాలి.

కొంద‌రు మ‌హిళ‌లు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో అయోడిన్ లోపానికి గురై థైరాయిడ్ బారిన ప‌డ‌తారు.అందుకే ప్ర‌తి రోజూ త‌గిన మోతాదులో అయోడిన్ ఉప్పు తీసుకోవ‌డ‌మే కాదు.పాల ఉత్పత్తులు, మొక్క‌ జొన్న‌లు, తృణ ధాన్యాలు, రొయ్య‌లు తింటే అయోడిన్ అందుతుంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఇక గ‌ర్భిణీలు ప్రోటీన్‌, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, విట‌మిన్ సి పోష‌కాల‌ను సైతం ప్ర‌తి రోజూ తీసుకోవాలి.ఇక ఈ పోష‌కాల కోసం ఉడికించిన శెన‌గ‌లు, బీన్స్‌, సిట్ర‌స్ పండ్లు, అవ‌కాడో, వాల్ న‌ట్స్‌, బాదం, నెయ్యి, బ్రొకోలీ, ట‌మాటా, అర‌టి పండ్లు, క్యారెట్ వంటి ఆహారాలు తీసుకోవ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు