ఆ స్టార్ హీరోకు ఊరమాస్ ఎలివేషన్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య.. అంత అభిమానమా?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Director Prashanth Neel ) గురించి మనందరికీ తెలిసిందే.

కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సలార్ మూవీతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు మరిన్ని పాన్ ఇండియా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు సైతం ఎగబడుతున్నారు.

కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కించిన సలార్ చిత్రం కూడా హిట్ అయింది.అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ మరో తెలుగు స్టార్ తో సినిమా మొదలు పెట్టాడు.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.( NTR )

Prashanth Neel Wife Comments On Jr Ntr Details, Prashanth Neel, Prashanth Neel W
Advertisement
Prashanth Neel Wife Comments On Jr Ntr Details, Prashanth Neel, Prashanth Neel W

ప్రశాంత్ నీల్, తారక్ కాంబినేషన్ లో చిత్రం రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ మొదలైంది.దాదాపు 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో ప్రశాంత్ నీల్ భారీ సన్నివేశాలని ప్రారంభించారు.ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కావడానికి ఇంకా టైం పడుతుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.మార్చిలో ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారు అని తెలుస్తోంది.

కాగా ఈ చిత్ర కథ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నేపథ్యంలో ఎన్టీఆర్, నీల్ చిత్రం ఉండబోతోంది అని అంటున్నారు.

Prashanth Neel Wife Comments On Jr Ntr Details, Prashanth Neel, Prashanth Neel W

నల్లమందు అంశాలతో పీరియాడిక్ నేపథ్యంలో నీల్ భారీ యాక్షన్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి( Likitha Reddy ) ఈ చిత్రం ప్రారంభమైన నేపథ్యంలో ఊర మాస్ ఎలివేషన్ ఇస్తూ పోస్ట్ చేశారు.ప్రశాంత్ నీల్ మైక్ పట్టుకుని షాట్ చెబుతున్న దృశ్యాలని లిఖిత రెడ్డి పోస్ట్ చేశారు.

సింహగడ్ కోటలో న్యూజిలాండ్ టూరిస్ట్‌కు చేదు అనుభవం.. బూతులు తిట్టించిన యువకులు?
హరీష్ శంకర్ ను పక్కన పెట్టేసిన రామ్ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడా..?

అతడు మైక్ పట్టుకుంటే ఆ తర్వాత జరిగేది ఒక చరిత్ర అంటూ ఒక ఎలివేషన్ ఇచ్చారు.డెడ్లియెస్ట్ షో డౌన్ మొదలయింది.విధ్వంసానికి అడ్డా అయినా ప్రాంతానికి స్వాగతం.

Advertisement

ఎన్టీఆర్ కోసం ఎదురు చూడలేకున్నా అంటూ లిఖితా ఒక రేంజ్ హైప్ ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పోస్టుతో తారక్ ప్రశాంత్ కాంబో మూవీపై అంచనాలకు మరింత పెరిగాయి.

తాజా వార్తలు