వింటేజ్ డార్లింగ్ ను గుర్తుకు తెచ్చిన ప్రభాస్.. ఈ లుక్స్ కు మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.

ఇకపోతే ప్రభాస్ చివరగా సలార్ మూవీతో( Salaar movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇకపోతే ప్రభాస్ గత సినిమా అయినా ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే.

Prabhas With Vintage Look And Feel, Prabhas, Vintage Look, Tollywood, Kalki 2898

కొందరు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసేందుకు వెనుకాడలేదు.అలాగే సలార్ లో డబ్బింగ్ మీద కొన్ని విమర్శలు వినిపించాయి.కానీ నిన్న జరిగిన కల్కి 2898 ఏడి( Kalki 2898 AD ) ఈవెంట్ లో ప్రభాస్ లో ప్రత్యక్షంగా, లైవ్ ద్వారా చూసిన వాళ్లకు చాలా అనుమానాలు తీరిపోయాయి.

Advertisement
Prabhas With Vintage Look And Feel, Prabhas, Vintage Look, Tollywood, Kalki 2898

ముఖ్యంగా ఒకప్పటి వింటేజ్ డార్లింగ్ ని గుర్తు చేసేలా మొహంలో పెరిగిన వర్చస్సు, తగ్గించుకున్న బరువు, మొహమాటంతో కూడిన ఒక అందమైన నవ్వుని అలా కొనసాగించడం ఇలా తనను ఇష్టపడే వాళ్ళు అలా చూస్తూనే ఉండాలనిపించేలా కనిపించాడు డార్లింగ్.

Prabhas With Vintage Look And Feel, Prabhas, Vintage Look, Tollywood, Kalki 2898

ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు.ప్రభాస్ లేటెస్ట్ లుక్ వింటేజ్ డార్లింగ్ లుక్ ను గుర్తుకు తెచ్చేలా ఉంది.ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ ని చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

అంతేకాకుండా ప్రభాస్ గత సినిమాలను చూసి విమర్శించిన అభిమానులు, నెటిజన్స్ సైతం ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.ప్రస్తుతం లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు