ఆ క్రేజీ డైరెక్టర్‌తో మూడోసారి జతకడుతున్న ప్రభాస్

బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ గుర్తింపును తెచ్చుకున్నాడు.

ఈ హీరోతో సినిమా చేసేందుకు చాలా మంది డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు.

అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ప్రభాస్ సాహో చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో తెరకెక్కించి మరో సక్సెస్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

Prabhas To Join Puri Jagannadh For Third Time, Prabhas, Puri Jagannadh, Ismart S

ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన ప్రభాస్, ఆ తరువాత టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.గతంలో పూరీతో కలిసి బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్ వంటి సినిమాలను తెరకెక్కించిన ప్రభాస్, ఆ రెండు సినిమాలు ఫ్లాప్‌లుగా మిగలడంతో మళ్లీ ఆయనతో సినిమా చేయలేదు.

కానీ ఇప్పుడు పూరీ ఉన్న ఫాంతో ప్రభాస్ ఆయనతో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు.దీని కోసం పూరీ ఇప్పటికే ఓ స్టోరీలైన్ కూడా రెడీ చేసినట్లు, త్వరలోనే ప్రభాస్‌కు దాన్ని వినిపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఒకవేళ ఈ సినిమా గనుక నిజంగా తెరకెక్కితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజమైన పండగని చెప్పాలి.ప్రభాస్‌ను పూరీ అంత మాస్‌గా మరే ఇతర డైరెక్టర్ చూపించలేడు అనేది జగమెరిగిన సత్యం.

మరి ప్రభాస్‌తో పూరీ హ్యాట్రిక్ కాంబో సెట్ అవుతుందా లేక ఇదొక గాలి వార్తగానే మిగులుతుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు