నారాయణపురం బస్తీలో పోలీస్ సైకిల్ గస్తీ...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం పోలీస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ సుమారు 40 ఏళ్ల క్రితం పోలీసులు తొలిసారి వాహనంగా వినియోగించిన సైకిల్ ను లోకల్ ఇల్లీగల్ దందాపై గస్తీ కాసేందుకు మళ్ళీ ప్రవేశ పెట్టారు.

ఒక్కప్పుడు హాఫ్ నిక్కర్,కుచ్చు టోపీ,చేతిలో లారీతో కాలి నడకన పోలీసులు గ్రామాలకు వచ్చేవారు.

ఆ తర్వాత హీరో లేదా అట్లాస్ సైకిల్ పై తిరిగేవారువారు.అక్కడి నుండి ప్యాంట్,షార్ట్,షూ బైక్,జీపు,కారు కుయ్ కుయ్ అనే సైరన్ వరకు పోలీస్ వాహనాలు కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ వచ్చాయి.

దీనితో నేరగాళ్లు, ఆకతాయిలు,ఇల్లీగల్ దందాలు చేసేటోళ్ళు కూడా అప్డేట్ అవుతూ పోలీసులకు కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు.ఇదంతా పోలీస్ వెహికిల్ చప్పుడు, సైరన్ ద్వారానేనని పసిగట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీసులు అనుమానితులపై నిఘా పెట్టేందుకు పోలీస్ మొట్టమొదటి వాహనం సైకిల్ ను వాడాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రతీ పోలీస్ ప్రతీ గల్లీలో బస్తీ మొత్తం సైకిల్ పై గస్తీ తిరుగుతూ అనుమానితులపై నజర్ పెట్టాలని ఆర్థర్ పాస్ చేశారు.ఇంకేముంది అధికారులు ఆర్థర్ వేసుడే ఆలస్యం మన పోలీస్ అన్నలు సైకిల్ పై సవారీ చేస్తూ బస్తీలో గస్తీ కొడుతూ అనుమానితుల ఆటలు ఇక సాగవని సాగిపోతుండ్రు.

Advertisement

మండల కేంద్రంలో సైకిల్ పై గస్తీ కాస్తున్న పోలీస్ అన్నలు తెలుగు స్టాఫ్ డాట్ కామ్ కెమెరాకు చిక్కారు.క్లిక్ మని ఓ ఫోటో కొట్టి మీ కోసం వార్త వేస్తున్నాం.

ఇక గల్లీలో నకరాలు చేస్తే పట్టుడు నరాలు తీసుడే.గిది జూస్తుంటే ముక్కు గోసినా మొదటి మొగుడే దిక్కన్న సామెత యాదికొస్తుందిలే.!ఇంతకీ నారాయణపురం పోలీస్ చేస్తున్న గీ పనికి ప్రజలు మంటుండ్రో ఎరికేనా సూపర్ పోలీసింగ్ శభాష్ అంటూ సెల్యూట్ గొడుతుండ్రు.

గదన్నమాట ముచ్చట.ఎట్లుంది యాదాద్రి జిల్లా పోలీస్ ఉపాయం.

మల్టీ లెవల్ మార్కెటింగ్(MLM) మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Advertisement

Latest Yadadri Bhuvanagiri News