దీపావళి సందర్భంగా 23న అయోధ్యలో 15 లక్షల దీపోత్సవ వేడుకకు ప్రధాని మోదీ రాక..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

మన దేశంలో ప్రతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటారు.

అంతేకాకుండా ప్రతి పండుగకు రకరకాల కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు.అలాగే దీపావళి పండుగకు కూడా ప్రత్యేకంగా దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 23న జరిగే దీపోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య వచ్చి, దీపాల మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది.సరయూ నది ఒడ్డున నెలకొని ఉన్న రామ్‌కీ పైడి ఘాట్‌ల శ్రేణిలో దీపోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు.

ఆ తర్వాత అయోధ్యలోని భక్తుల సమక్షంలో దీపావళి పండుగను ప్రధాని మోదీ జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం దీపావళికి ఒక రోజు ముందు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దీపాల మహా ఉత్సవాన్ని నిర్వహించి పండుగ చేసుకుంటారు.

Advertisement

దీనితో అయోధ్యలోని ప్రజలు సరయు నది తీరంలో ద్వీపాలతో వరుసుగా నిలబడతారు.దీపావళి పండుగకు ఇలాంటి సంప్రదాయాన్ని అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో మొదలైంది.2017లో 51 వేలమంది దివ్యాంగులతో ప్రారంభమైన ఈ దీపోత్సవ సంప్రదాయం, 2019లో 4.10 లక్షలకు చేరింది.2020లో ఆరు లక్షలకు పైగా, గత ఏడాది తొమ్మిది లక్షలకు పైగా చేరి కొత్త గిన్నిస్ రికార్డును సృష్టించింది.

ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మందితో మళ్ళీ చరిత్రత్మక రికార్డును నెలకొల్పే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది.మోదీ అయోధ్య పర్యటన లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన సాయంత్రం 4.55 గంటలకు శ్రీ రామ జన్మభూమిలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్‌మన్‌ దగ్గర ప్రధాని మోదీ పూజలు చేస్తారు.5.40గంటలకు శ్రీ రామ్ కథా పార్కులో నిర్వహించే శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉంది.6.25గంటలకు సరయు కొత్త ఘాట్ వద్ద హారతిలో పాల్గొనే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు