అమెరికా: పెద్దలందరికీ కరోనా టీకా.. మరి చిన్నారులు పరిస్ధితి, ఫైజర్ గుడ్‌న్యూస్

2019 ఆఖర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది.తగ్గుతూ, పెరుగుతూ ఇంకా మానవాళిపై పంజా విసురుతూనే వుంది.

ఈ మహమ్మారి అంతం కోసం శాస్త్రవేత్తలు, ఫార్మా సంస్థలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.దీంతో ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి పెట్టాయి.

కోవిషీల్డ్, కొవాగ్జిన్, మోడెర్నా, ఫైజర్, ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ , స్ఫుత్నిక్ వంటి టీకాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.ప్రాధాన్యత క్రమాన్ని బట్టి, వయసుల వారీగా టీకాలు వేస్తున్నాయి ఆయా దేశాలు.

కానీ చిన్నారులకు మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు.ఈ నేపథ్యంలో అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక ప్రకటన చేసింది.ఫైజర్‌ ఐఎన్‌సీ, జర్మనీకి చెందిన బయో ఎంటెక్‌తో కలిసి 12 సంవత్సరాల లోపు పిల్లలపై కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.2022 ప్రారంభం నాటికి చిన్నారులకు టీకాను అందుబాటులో తేవడమే తమ లక్ష్యమని ఫైజర్ పేర్కొంది.ట్రయల్స్‌లో భాగంగా బుధవారం వాలంటీర్లకు మొదటి డోస్‌ ఇచ్చినట్లు ఫైజర్‌ వర్గాలు ప్రకటించాయి.

Advertisement

తాజా వ్యాక్సిన్ ట్రయల్‌‌లో ఆరు నెలల వయస్సులోపు పిల్లలపై ప్రయోగాలు చేయనున్నారు.గతవారం మోడెర్నా సైతం ఇదే తరహాలో పిల్లలపై ట్రయల్స్‌ను ప్రారంభించింది.

ప్రస్తుతం అమెరికాలో 16-17 సంవత్సరాల పిల్లలకు ఫైజర్‌, 18 అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి మోడెర్నా టీకాను ఇచ్చేందుకు మాత్రమే అనుమతి ఉండగా.చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతి లేదు.

ఫైజర్‌.రెండు షాట్ల వ్యాక్సిన్‌ను మూడు వేర్వేరు మోతాదుల్లో 10, 20, 30 మైక్రోగ్రాముల వద్ద 144 మంది చిన్నారులపై రెండు దశల ట్రయల్స్‌ నిర్వహించాలని యోచిస్తోంది.

మొత్తంగా 4,500 మందిపై ట్రయల్స్‌ పెంచాలని భావిస్తోంది.టీకా ద్వారా ఉత్పన్నమయ్యే ప్రతి స్పందనను శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

కాగా.ఫైజర్‌, బయో ఎంటెక్‌ వ్యాక్సిన్‌కు యూఎస్‌ రెగ్యులేటరి డిసెంబర్‌‌ మొదటి వారంలో అత్యవసర వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా తొలి టీకాను ఓ నర్సుకు అందజేశారు అధికారులు.

Advertisement

క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్‌ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్‌లో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్స్‌ అమెరికాలో తొలి కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర పుటల్లోకెక్కారు.యూఎస్‌ సీడీసీ లెక్కల ప్రకారం.

బుధవారం నాటికి అమెరికాలో దాదాపు 66 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వబడింది.

తాజా వార్తలు