జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతిపత్రం

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు ఇవ్వాలని వేములవాడ ఎంఎల్ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులు వేములవాడ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో వినతిపత్రం సమర్పించారు.

దశాబ్ద కాలంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరిన ఇవ్వడం లేదని ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నందున అందులో నుండి లేకుంటే వేరే చోట ఇంటి స్థలాలు , హెల్త్ కార్డులు , ఇప్పించాలని ఆది శ్రీనివాస్ కు ఇచ్చిన వినతి పత్రంలో వారు పేర్కొన్నారు.

చాలామంది జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని పేదరికంతో కొందరు జర్నలిస్టులు సొంత ఇల్లు లేక కొందరు జర్నలిస్టులు అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.దశాబ్ద కాలంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వ హాయాంలో పాలకులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించిన స్పందించలేదన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు , హెల్త్ కార్డులు ఇప్పించాలని టియుడబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహాత్ అలీ కి , జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ కు , వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఎల్లారెడ్డిపేట జర్నలిస్టులు ఎండి మజీద్ , ఎదురుగట్ల ముత్తయ్య గౌడ్ , బండారి బాల్ రెడ్డి , దుంపేటి గౌరీ శంకర్ , చెట్కూరి కృష్ణమూర్తి గౌడ్ , కోండ్లేపు జగదీష్ , సయ్యద్ షరీఫ్ , కందుకూరి రవి , కట్టెల బాబు , గోస్కుల రమేష్ , శ్రీరామోజీ ప్రవీణ్ , బీపేట మనోజ్ యాదవ్ , కట్టెల సాయి , తదితరులు పాల్గొని వినతిపత్రాలను సమర్పించారు.

ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్...వర్కౌట్ అవుతుందా..?
Advertisement

Latest Rajanna Sircilla News