పెప్సికో పై గెలిచిన రైతులు! కేసుని వెనక్కి తీసుకున్న సంస్థ

కొద్ది రోజుల క్రితం ప్రముఖ కంపెనీ పెప్సికో తన లేస్ ప్రొడక్ట్ కి సంబంధించిన బంగాళదుంప పండించారని అభియోగంతో గుజరాత్లో రైతులపై కోర్టులో పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ పిటిషన్పై దేశ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

రైతులు వేసుకునే ఒక కంపెనీ నియంత్రణ విధిస్తూ కేసు వేయడం సర్వత్ర విమర్శలకు దారి తీసింది.ఇదిలా ఉంటే తాజాగా పెప్సికో సంస్థ రైతులపై వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.

Pepsi Co Company Back Withdraw Petition On Opposite Formers-పెప్సి�

తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు అఖిల భారత కిసాన్ సభ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చేసింది.విత్తనోత్పత్తి స్వేచ్ఛపై రైతులు చేస్తున్న పోరాటంలో విజయం సాధించినట్లు అఖిల భారత కిసాన్ సభ ప్రకటించింది.

ఆలుగడ్డ ఉత్పత్తులకు సంబంధించి ఆ కంపెనీ రైతులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని లేదంటే ఉదృతంగా నిరసనలకు సిద్ధపడాలని అఖిల భారత కిసాన్ సభ హెచ్చరించిన నేపథ్యంలో వెనక్కి తగ్గిందని చెప్పాలి.మరోవైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సంస్థ తల వెనక్కు తీసుకుంది.

Advertisement
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

తాజా వార్తలు