విజయ్ వద్దు ప్రభాస్ ముద్దు అంటున్న పాయల్....

తెలుగులో ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించినటువంటి ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్  తన అందచందాలతో ప్రేక్షకుల్ని ఎలా కట్టిపడేసింది మనందరికీ బాగా తెలుసు.

అయితే ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడుకి మంచి అవకాశాలే వచ్చాయి.

ఇందులో భాగంగా ఎన్టీఆర్  కథానాయకుడు చిత్రంలో  సీనియర్ నటి జయసుధ పాత్రలో మెప్పించారు.ఈ చిత్రం తర్వాత వచ్చిన ఆర్ డి ఎక్స్ పెద్దగా ఆడకపోయినా విక్టరీ వెంకటేష్ సరసన వెంకి మామ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది.ఈ అమ్మడు ప్రతి శనివారం ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఎటువంటి క్యాష్ ప్రోగ్రామ్ లో పాల్గొంది.

Payal Raj Put Vijaydevarakonda Prabhas Venkymama Raj Put Vijaydevarakonda Prabh

అయితే తాజాగా ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇందులో  యాంకర్ సుమ ఈ ఇద్దరి హీరోలతో నటించే ఛాన్స్ వస్తే నువ్వు ఎవరిని ఎంచుకుంటావని మొదట ప్రభాస్ పేరు చెప్పగా రెండో పేరు వినకుండానే ప్రభాస్ ని ఓకే చేసింది ఈ అమ్మడు.అంతేగాక ఎప్పుడైనా, ఎక్కడైనా  ప్రభాస్ తో నటించడానికి సరే అంటోంది పాయాల్.అయితే ఇందులో సుమ మొదటి  ప్రభాస్ పేరు చెప్పగా రెండవ పేరు విజయ్ దేవరకొండ అని చెప్పే లోపలే పాయల్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Advertisement
Payal Raj Put Vijaydevarakonda Prabhas Venkymama Raj Put Vijaydevarakonda Prabh

దీంతో సోషల్ మీడియాలో డార్లింగ్ ఫాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

మంచు విష్ణు స్టార్ హీరో అయ్యే అవకాశం వచ్చిందా..?
Advertisement

తాజా వార్తలు