అర్థం కాని పవన్ అంతరంగం ! అంతు చిక్కని వ్యూహం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan klayan ) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జన సమీకరణ చేపట్టాల్సిన అవసరం లేకుండానే పవన్ సభలకు  భారీ స్థాయిలో స్వచ్ఛందంగా తరలి వస్తుంటారు.

మరే నాయకుడికి ఈ స్థాయిలో స్వచ్ఛందంగా జనాలు వచ్చే పరిస్థితి లేదు ఆ స్థాయిలో ఉన్న క్రేజ్ ను రాజకీయంగానూ ఉపయోగించుకుని సక్సెస్ కావాలి అనే పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారు.తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన విజయవంతంగా ముగించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం పవన్ ఉన్నారు.అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువగానే ఈ సభ సక్సెస్ అయ్యింది.

కాపు సామాజిక వర్గం ఈ జిల్లాలో ఎక్కువగా ఉండడం, పవన్ అభిమానులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉండడం, ఇవన్నీ పవన్ సభను సక్సెస్ చేశాయి.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్రను పోల్చి చూసుకుంటే, పవన్ యాత్ర అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యింది.

Advertisement

దాదాపు 12 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటించారు.అనేక బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేశారు.ముఖ్యంగా వైసిపి( YCP ) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం తనకు పూర్తిగా అండగా నిలబడాలని పవన్ పదేపదే కోరారు.అయితే కొన్ని కొన్ని ప్రసంగాలతో పవన్ అంతరంగం ఏమిటనేది ఎవరికి అంతుపట్టడం లేదు.

ఒక్కోచోట ఒక్కో విధంగా మాట్లాడుతుండడంతో రాజకీయంగా పవన్ కన్ఫ్యూజ్ అవుతున్నారనే విషయం అర్థం అవుతోంది.గతంలో సీఎం సీటు పై ఆశ లేదని చెప్పిన పవన్, వారాహి యాత్రలో మాత్రం మీరంతా గెలిపిస్తే సీఎం కుర్చీలో కూర్చుంటానని, జనసేన అధికారంలోకి వచ్చేలా ఓట్లేసి గెలిపించాలని పవన్ కోరారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

పరుష పదజాలంతోను వైసిపి ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకుల పైన పవన్ విమర్శలు చేశారు.

Advertisement

గుండు గీయిస్తా, తోలు తీస్తా అంటూ మాట్లాడిన మాటలపైన వివాదం సాగింది.కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ విషయాలపై అభ్యంతరం లేవనెత్తారు.ఈ మేరకు పవన్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

దీంతో పవన్ అభిమానులు, జనసేన నాయకులు ముద్రగడను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.దీంతో ముద్రగడకు మద్దతుగా కొంతమంది, పవన్ కు మద్దతుగా కొంతమంది నిలబడడంతో, కాపు సామాజిక వర్గం లో చీలిక వచ్చినట్లు కనిపించింది.

గతంలో సీఎం సీటు పై ఆశ లేదని చెప్పిన పవన్ వారాహి యాత్ర( Varahi yatra )లో మాత్రం మీరంతా గెలిపిస్తే సీఎం కుర్చీలో కూర్చుంటానని, జనసేన అధికారంలోకి వచ్చేలా ఓట్లేసి గెలిపించాలని పవన్ కోరారు.పరుష పదజాలంతోను వైసిపి ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకుల పైన పవన్ విమర్శలు చేశారు.గుండు గీయిస్తా, తోలు తీస్తా అంటూ మాట్లాడిన మాటలపైన వివాదం సాగింది.

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ విషయాలపై అభ్యంతరం లేవనెత్తారు.ఈ మేరకు పవన్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

దీంతో పవన్ అభిమానులు, జనసేన నాయకులు ముద్రగడను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.దీంతో ముద్రగడకు మద్దతుగా కొంతమంది, పవన్ కు మద్దతుగా కొంతమంది నిలబడడంతో, కాపు  సామాజిక వర్గం లో చీలిక వచ్చినట్లు కనిపించింది.

కులం వద్దు అని చెబుతూనే.కాపులంతా సంఘటితమై జనసేనకు మద్దతుగా నిలబడాలని పవన్ కోరుతున్నారు.

ఇక పొత్తుల విషయంలోనూ ఇదే విధమైన గజిబిజి కనిపించింది.వారాహి యాత్ర ప్రారంభానికి ముందు జనసేన , బీజేపీ తో పాటు, టీడీపీని కలుపుకువెళ్తాము అంటూ ప్రకటనలు చేసిన పవన్, వారాహి యాత్ర లో మాత్రం పొత్తుల అంశం పై స్పందించలేదు.

దీంతో పవన్ అంతరంగం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

తాజా వార్తలు