పవన్ గ్లింప్స్ కు హైలెట్ ఇదే.. ఆ డైలాగ్ పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఉండనుందా?

సెప్టెంబర్ నెల 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పవన్ అభిమానులకు మరింత స్పెషల్ గా ఉండనుంది.

పవన్ పుట్టినరోజు కానుకగా గుడుంబా శంకర్ మూవీ( Gudumba Shankar ) రీ రిలీజ్ కానుండగా అదే సమయంలో ఓజీ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ కానుంది.రన్ రాజా రన్, సాహో సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Pawan Kalyan Og Movie Glimpse Highlight Shots Details Here Goes Viral In Social

అయితే 72 సెకన్ల నిడివితో ఈ గ్లింప్స్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.అయితే పవన్ గ్లింప్స్ క్లైమాక్స్ లో చెప్పే డైలాగ్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలవనుందని భోగట్టా, అర్జున్ దాస్ వాయిస్ తో ఉండే ఈ గ్లింప్స్ మామూలుగా ఉండదని మెగా ఫ్యాన్స్ కోరుకున్న అన్ని అంశాలు ఉండేలా సుజీత్ ( Sujeeth )ప్లాన్ చేశారని తెలుస్తోంది.డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Pawan Kalyan Og Movie Glimpse Highlight Shots Details Here Goes Viral In Social

ఓజీ గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.ఓజీ( Og movie ) రిలీజ్ కు సంబంధించి వేర్వేరు డేట్లు ప్రచారంలోకి వస్తున్నాయి.ఈ ఏడాది డిసెంబర్ లేదా 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement
Pawan Kalyan Og Movie Glimpse Highlight Shots Details Here Goes Viral In Social

ఈ రెండు రిలీజ్ డేట్లు మిస్సైతే మాత్రం 2024 సమ్మర్ కానుకగా ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి కాగా అక్టోబర్, నవంబర్ లో పవన్ ఈ సినిమాకు డేట్స్ కేటాయించారని సమాచారం.

సుజీత్ శరవేగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ మూవీ స్ట్రెయిట్ మూవీ కావడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.ఈ సినిమాకు పవన్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు