పింక్ రీమేక్‌కు పవన్ ఎంత పుచ్చుకుంటున్నాడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం బాలీవుడ్‌ సినిమా ‘పింక్’కు రీమేక్ అనే విషయం తెలిసిందే.

అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

కాగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పింక్ రీమేక్ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 26 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చారు.ఈ 26 రోజుల్లోనే ఆయన సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ముగించనున్నారు.

అయితే కేవలం 26 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నందుకుగాను పవన్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.పవన్ ఏకంగా రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకుని, సినిమా రిలీజ్ తరువాత మరో రూ.10 కోట్ల షేర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.అంటే పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కోసం ఏకంగా రూ.60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడు.ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఒక్క పవన్‌కు మాత్రమే సాధ్యమని అంటున్నారు సినీ జనం.ఏదేమైనా పవన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Advertisement
టెక్సాస్: బీర్ బాటిల్ ఎత్తేసిన చిన్నారి.. ఎలా తాగుతుందో చూస్తే..

తాజా వార్తలు