వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.

బీజేపీ ఓబీసీ మోర్చా నేత సురేశ్ తో పోలీస్ అధికారి వ్యవహారించిన తీరుపై ఆయన ధ్వజమెత్తారు.

నిరసన గళాలు అణచివేస్తాం.కాళ్ల కింద పడేసి తొక్కుతాం అంటే అది నియంతృత్వం అని స్పష్టం చేశారు.

పోలీస్ అధికారి నిన్న వ్యవహారించిన తీరు పాలకుల మనస్తత్వానికి అద్దం పడుతోందని విమర్శించారు.ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న అణచివేత చర్యలను ఖండిస్తున్నామన్నారు.

వైసీపీ సర్కార్ పై సురేశ్ చేస్తున్న నిరసనకు జనసేన అండగా ఉంటామని వెల్లడించారు.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు