పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే సినిమా ఫ్లాపేనా... ఇదేం లాజిక్?

శంకర్( Shankar ) దర్శకత్వంలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్( Hero Ram Charan ) హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్.

ఇటీవలే జనవరి 10వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ తో పాటు బోలెడంత నెగెటివిటీ కూడా జరిగిన విషయం తెలిసిందే.అయితే ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై ట్రోలింగ్ జరిగిన తర్వాత, టీమ్ అంతా సైలెంట్ అయిపోయారు.

అదే సమయంలో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఫెస్టివల్ హాలీడేస్ ను క్యాష్ చేసుకున్నాయి.సెకండ్ వీకెండ్ లోనూ డామినేషన్ చూపించాయి.

Pawan Kalyan Chief Guest Effect, Pawan Kalyan, Cinime Flop, Ram Charan, Game Cha

ఈ సంగతి అటుంచితే, మెగా మూవీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మారడానికి పవన్ కల్యాణ్ కూడా ఒక కారణమనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.సినిమా విడుదలకు ముందు రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ( Game Changer Movie Pre Release )ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Andhra Pradesh Deputy CM Pawan Kalyan )చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.అయితే పవన్ ఏదైనా ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వస్తే, ఆ సినిమాలు ఫ్లాప్ అవుతాయని యాంటీ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

Advertisement
Pawan Kalyan Chief Guest Effect, Pawan Kalyan, Cinime Flop, Ram Charan, Game Cha

గతంలో,అంటే సుందరానికి,రిపబ్లిక్,సైరా నరసింహా రెడ్డి,నా పేరు సూర్య, నేల టికెట్, చల్ మోహన్ రంగా ఇలా ఎన్నో సినిమాల ఈవెంట్స్ కు పవన్ చీఫ్ గెస్టుగా వచ్చారు.అయితే అవన్నీ ఫ్లాప్ అయ్యాయని ఉదాహరణలుగా చెబుతున్నారు.

ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేసిందని అంటున్నారు.

Pawan Kalyan Chief Guest Effect, Pawan Kalyan, Cinime Flop, Ram Charan, Game Cha

అయితే కొంతమంది మాత్రం ఈ వాదనలను అంగీకరించడం లేదు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ రావడం వల్ల సినిమాలు ఫెయిల్ అయ్యాయి అన్నది సరైనది కాదు.పవన్ కళ్యాణ్ అతిథిగా పాల్గొన్న జులాయి,ఇష్క్,నాయక్ లాంటి సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఈవెంట్ లోనూ చిరంజీవితో కలిసి పాల్గొన్నారు పవన్.కాబట్టి పవన్ గెస్ట్ గా వస్తే సినిమాలు పోతాయనే వాదనలో అర్థం లేదు అంటూ మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ వార్తలను ఆ కామెంట్స్ ని కొట్టి పారేస్తున్నారు.

అక్రమ వలసదారుల బహిష్కరణ .. పంజాబ్ పోలీసులపై బాధితుల ఆరోపణలు
Advertisement

తాజా వార్తలు