'బ్రో' 4 డేస్ కలెక్షన్స్.. మండే టెస్ట్ లో ఢమాల్ అయినట్టేనా?

మెగా మల్టీస్టారర్ కోసం ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో ది అవతార్.

( Bro Movie ) వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.పవన్ కళ్యాణ్ జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Pawan Kalyan Bro Day 4 Collections, Vinodhaya Sitham, Pawan Kalyan, Sai Dharam T

ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.ఇక సముద్రఖని( Samuthirakani ) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్ లుగా నటించగా ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేసింది.

ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా వీకేండ్ లో కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టింది.మరి బ్రో సినిమా మొదటి 4 రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది అంటే.

Advertisement
Pawan Kalyan Bro Day 4 Collections, Vinodhaya Sitham, Pawan Kalyan, Sai Dharam T

ఈ సినిమా 97 కోట్ల ప్రీ బిజినెస్( Bro Movie Pre Business ) చేసుకుని 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఇక ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 55.26 కోట్ల షేర్, 91.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

Pawan Kalyan Bro Day 4 Collections, Vinodhaya Sitham, Pawan Kalyan, Sai Dharam T

అయితే నాలుగవ రోజు మండే వర్కింగ్ డే కావడంతో బ్రో కలెక్షన్స్( Bro Movie Collections ) కు భారీ చిల్లు పడినట్టు తెలుస్తుంది.4వ రోజు ఈ సినిమా కేవలం 5.5 కోట్ల రేంజ్ లోనే వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.దీన్ని బట్టి చుస్తే మండే టెస్ట్ లో పవర్ స్టార్ మార్క్ కూడా ఎక్కడ చూపించలేదు.

మండే భారీగా వసూళ్లు తగ్గడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎప్పుడు ఫినిష్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు