అనవసరంగా ఎవరు నిందించవద్దు... ట్రోల్స్ పై స్పందించిన జ్యోతి రాయ్!

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి జ్యోతి రాయ్ ( Jyothi Rai ) అలియాస్ జగతి గురించి అందరికీ సుపరిచితమే.ఈమె గుప్పెడంత మనసు ( Guppendantha Manasu ) సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

 Don't Blame Anyone Unnecessarily, Jyothi Rai, Sukh Purvaj, Guppendantha Manasu,-TeluguStop.com

అయితే కర్ణాటకలో ఈమె దాదాపు 20 సీరియల్స్ లో నటించి ఎంతో పాపులారిటీ ఉన్న నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా జగతి పాత్రలో లీనమైపోయినటువంటి జ్యోతి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈమె భర్తకు విడాకులు ఇచ్చి యంగ్ డైరెక్టర్ తో రిలేషన్లో ఉన్నారు అంటూ తన పట్ల ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Jyothi Purvaj, Jyothi Rai, Sukh Purvaj-Movie

కన్నడ బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జ్యోతి పద్మనాభం అనే వ్యక్తిని 20 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకున్నారట వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.అయితే ఈమె ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించిన తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చి ఒక యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.అదేవిధంగా ఈమె ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా జ్యోతి పూర్వజ్ ( Jyothi Purvaj ) అని ఉండటంతో ఈమె తనని రెండవ వివాహం చేసుకుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో చాలామంది ఈమె పట్ల ట్రోల్స్ చేశారు.

Telugu Jyothi Purvaj, Jyothi Rai, Sukh Purvaj-Movie

ఇలా తన గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై నటి జ్యోతి స్పందించారు.ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా డైరెక్టర్ సుఖ పూర్వజ్( Sukh Purvaj ) , అలాగే తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… మీకు తెలియకుండా.అర్థం కాకుండా ఎవరిని నిందించవద్దు.మీరు ఎవరు కూడా నా వెంట నడవలేరని గుర్తుపెట్టుకోండి అంటూ ఈ సందర్భంగా ఈమె ఈ ఫోటోని షేర్ చేశారు.ఆమె మరి ఎవరిని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారన్న విషయం తెలియక పోయినప్పటికీ తన గురించి వస్తున్నటువంటి వార్తలకు ఇలా చెక్ పెట్టారని మాత్రం అర్థం అవుతుంది.ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube