ఈ ప్రముఖ నటి ఐదో పెళ్లి కూడా ​పెటాకులైందట.. ఏం జరిగిందంటే?

సాధారణంగా ఒకసారి విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంటే సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.

అయితే ప్రముఖ హాలీవుడ్ నటీమణులలో ఒకరైన పమేలా అండర్సన్‌ మాత్రం ఇప్పటికే నాలుగుసార్లు వేర్వేరు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.

ఈ నటి ఐదో పెళ్లి కూడా పెటాకులైందని త్వరలో ఈ నటి ఐదో భర్తకు కూడా విడాకులు ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఈ నటి వయస్సు 54 సంవత్సరాలు కాగా 2020 సంవత్సరంలో ఈ నటి ఐదో పెళ్లి చేసుకుంది.

ఈ నటి ఐదో పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె బాడీగార్డ్ కావడం గమనార్హం.బాడీగార్డ్ డాన్ హేపస్ట్ తో ప్రేమలో పడిన పమేలా అండర్సన్ లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి బంధం ద్వారా కలకాలం కలిసి ఉందామని భావించిన ఈ జంట విడాకుల కొరకు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి పమేలా అండర్సన్ స్పందించాల్సి ఉంది.1995 సంవత్సరంలో ఈ నటి మొదటి వివాహం జరిగింది.

Advertisement

టామీ లీ అనే వ్యక్తిని పమేలా పెళ్లి చేసుకోగా ఈ జంటకు ఇద్దరు కొడుకులు జన్మించారు.అయితే కొన్నేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత 2006 సంవత్సరంలో కిడ్ రాక్ అనే సంగీతకారుడిని పెళ్లి చేసుకున్నారు.

అయితే కిడ్ రాక్ తో కూడా ఈ నటి విడిపోయారు.

ఆ తర్వాత 2014 సంవత్సరంలో రిక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పమేలా వార్తల్లో నిలిచారు.అయితే వేర్వేరు కారణాల వల్ల మూడో భర్తతో కూడా ఈ నటి విడిపోయారు.ఆ తర్వాత 2020 సంవత్సరంలో ప్రొడ్యూసర్ జాన్ పీటర్స్ ను ఈ నటి వివాహం చేసుకోగా కొన్ని నెలలకే ఆమె భర్తతో విడిపోయారు.

ఐదో భర్తతో కూడా పమేలా విడాకులు తీసుకుంటూ ఉండటంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు