ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గ ఫలితాలు విడుదలయ్యాక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.అయితే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తరువాత రెండో బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
అయితే ఈటెల రాజేందర్ రెడ్డి రాజీనామా తరువాత హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈటెల రాజీనామా తరువాత కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని కౌశిక్ రెడ్డి భావించినప్పటికీ రేవంత్ రెడ్డి కొంత హుజూరాబాద్ లో కాంగ్రెస్ ను పోటీలో ఉంచడానికి రేవంత్ రెడ్డి ఆసక్తి కనబరచలేదు.
ఈ విషయాన్ని బహిరంగంగానే ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.
ఇక దీంతో పాడి కౌశిక్ రెడ్డి అలకబూని టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే ఆ తరువాత ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ గవర్నర్ ఆమోదం కోసం పంపిన పరిస్థితి ఉంది.కానీ ఇంకా ఎమ్మెల్సీ పదవి అంశంపై గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోద ముద్ర వేయని పరిస్తితి ఉంది.
ఇటు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయక, ఇటు ఎమ్మెల్సీ పదవి దక్కక, అప్పటి వరకు బలంగా ఉన్న కాంగ్రెస్ ను వీడటం ఇలా ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి భవిష్యత్తు రెంటికీ చెడ్డ రేవడిలా మారిన పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ మాత్రం కౌశిక్ రెడ్డికి మాత్రం హామీ ఇచ్చినట్లుగా భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం టీఆర్ఎస్ లో కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కౌశిక్ రెడ్డి పరిస్థితిని చూసి రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయంపై పాడి కౌశిక్ రెడ్డిని ఉదాహరణగా చూపిస్తున్న పరిస్థితి ఉంది.