Songs Background Dancers: ఒక్క పాట కోసం వందల మంది డ్యాన్సర్లను వాడుతున్న సినిమాలు.. ఎందుకు ఈ భారీ హంగులు

ఈ రోజుల్లో ఒక్క పాట కోసం కోట్లు ఖర్చు పెట్టడం, వందల నుంచి వేలాదిమంది డ్యాన్సర్లను( Dancers ) బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకోవడం కామన్ అయిపోయింది.దీని వల్ల సగటు ప్రేక్షకుడికి ఒరిగేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు.

కాకపోతే డ్యాన్సర్లకు కాస్త ఆర్థికంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.1000 కోట్లకు మించి బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టిన జవాన్ సినిమాలోని( Jawan Movie ) ఒక పాటలో ఏకంగా వెయ్యి మంది యువతులతో పాట పెట్టారు.దీనివల్ల చిన్నపాటి డాన్సర్లకు ఉపాధి కల్పించినట్లు అయింది.

కానీ వెయ్యి మంది ఫిమేల్ డ్యాన్సర్లతో డాన్స్ చేయించడం అంటే మామూలు విషయం కాదు.దీనిని ఎంత హంగులతో తీర్చిదిద్దాలా అని చాలామంది విమర్శలు చేసిన వారు కూడా ఉన్నారు.

మన తెలుగులో కూడా ఇదే సాంగ్ ట్రెండ్ కొనసాగుతోంది.నేషనల్ ఫిలిం అవార్డు గ్రహీత, దిగ్గజ కొరియోగ్రాఫర్ ప్రేమ్‌ రక్షిత్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలోని "నాటు నాటు" పాటకు( Naatu Naatu Song ) రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వేసిన స్టెప్పులను కంపోజ్ చేసింది మరెవరో కాదు ప్రేమ్ రక్షితే.

ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ చెర్రీతో మళ్ళీ జతకట్టాడు.దేవర సినిమాలో( Devara ) ఒక పాట కోసం వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది.

Advertisement

ఒక లావిష్ సాంగ్ షూట్ చేయడానికి ప్రేమ్ రక్షిత్‌( Prem Rakshit ) రెడీ అయ్యాడని తెలుస్తోంది.ఈ సినిమాలోని ఆ పాట కోసం రెండు వేల మంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లను తీసుకోనున్నారని సమాచారం.ఇంతమందితో పాట చిత్రీకరించడం అసలు అవసరమా? అంతమంది డాన్సర్లు ఒకే ఫ్రేమ్‌లో కూడా పట్టరు కదా ఎందుకంత భారీ హంగామా చేయడం, అనవసరమైన హంగులు తీర్చిదిద్దడం అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

మరోవైపు రామ్‌ చరణ్ హీరోగా చేస్తున్న "గేమ్ ఛేంజర్"( Game Changer ) సినిమాలోని ఒక పాట కోసం ఏకంగా వందమంది బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్లను తీసుకున్నారు.రీసెంట్‌గా ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలోని( Extra Ordinary Man Movie ) పాటను 300 మంది ఫార్నర్ డాన్సర్లతో షూట్ చేశారు.ఇంకా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తప్పనిసరిగా ఫాలో అయ్యే అవకాశం ఉంది.

దీని ద్వారా ఖర్చు ఎక్కువగా ఉండటమే కాక అవకాశాలు రాని డాన్సర్లకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు