ఆఫరేషన్ గుంటూరు ! జగన్ నిర్ణయం వెనుక కారణం ఏంటి ? 

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ , పార్టీని ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నమయ్యారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్.

  175 నియోజకవర్గాలకు 175 గెలుచుకోవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు .

అందుకే పదేపదే వై నాట్ 175 నినాదాన్ని వినిపిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ .నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నారు.  బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు .అక్కడ కీలక నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.  ఇక పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఈ విషయంలో ఎటువంటి మోహమాటాలకు జగన్( jagan ) వెళ్లడం లేదు .తనకు అత్యంత సన్నిహితులైన వారైనా వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోతే,  వారిని పక్కన పెడుతున్నారు.దీనిలో భాగంగానే నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు శ్రీకారం చుట్టారు .ఒకేరోజు 11 నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చి సంచలనం సృష్టించారు .అది కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదలైంది.నిన్న ప్రకటించిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు పెద్ద సంచలనం సృష్టించింది .ఇందులో ఏడూ సీట్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి.దీంతో గుంటూరు నుంచే ఆపరేషన్ ను జగన్ మొదలు పెట్టినట్టు అర్థమవుతుంది.

గుంటూరు జిల్లాలో ఒకేసారి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చడం వెనుక జగన్ వ్యూహం ఉంది అనేది చర్చనీయాంశంగా మారింది.  ఇన్చార్జిల పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం , సామాజిక వర్గాల సమీకరణ ఇవన్నీ లెక్కలు వేసుకుని గుంటూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్చార్జిలను నియమించారు.

Advertisement

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు , తాడికొండ,  వేమూరు ,, చిలకలూరిపేట , గుంటూరు వె,స్ట్,  మంగళగిరి ,రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి లను  మార్చారు.  దీంట్లో ప్రత్తిపాడు,  తాడికొండ , వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు.

ప్రత్తిపాడులో వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తప్పించి బాలసాని కిరణ్ కుమార్ అనే యువ నాయకుడికి అవకాశం ఇచ్చారు.  ఇతను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

విజయవాడలో వైసిపి కార్పొరేటర్ కుమారుడుగా తెలుస్తోంది.

టిడిపి( tdp ) ప్రత్తిపాడు అభ్యర్థిగా రిటైర్డ్ ఐఎస్ అధికారిని బరిలోకి దించుతోంది .దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వైసిపి ఇప్పుడు ఇన్చార్జి గా అవకాశం ఇచ్చింది.ఇప్పటి వరకు అక్కడ ఇన్చార్జిగా ఉన్న మేకతోటి సుచరితను తాడికొండ ఇన్చార్జిగా నియమించారు .అక్కడ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం టిడిపి కి అనుబంధంగా కొనసాగుతూ ఉండడంతో,  సుచరితను అక్కడ ఇన్చార్జిగా నియమించారు.అదీ కాకుండా ఆమె సొంత మండలం ఫిరంగిపురం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో( Tadikonda Assembly Constituency ) ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట .దీనికి తోడు ప్రతిపాడులో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోవడం తో సుచరితను తాడికొండ కు మార్చారు.వేమూరు అసెంబ్లీ సీట్లు మంత్రి మేరుగా నాగార్జునను తప్పించి ఆయన స్థానంలో వరికూటి అశోక్ బాబును ఇన్చార్జిగా నియమించారు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ఇక్కడ నాగార్జున పై వ్యతిరేకత ఉండడంతో ఆయనను ప్రకాశం జిల్లాకు  పంపించారు.ఆయన స్థానికుడు కాకపోయినా,  మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి,  నియోజకవర్గంలో కొత్త ముఖం కావడంతో కలిసి వస్తుంది అని లెక్కలు వేస్తున్నారు.

Advertisement

ఇక చిలకలూరిపేట నియోజకవర్గానికి వస్తే ఇక్కడ మంత్రి విడుదల రజిని( vidudala rajini ) ని తప్పించి మల్లెల రాజేష్ నాయుడు ని ఇన్చార్జిగా నియమించారు.రజనీకి ఇక్కడ టికెట్ ఇస్తే గెలుపు కష్టమనే అభిప్రాయంతో కాపు సామాజిక వర్గానికి చెందిన రాజేష్ కు బాధ్యతలు అప్పగించారు.మంత్రి విడుదల రజనీకి ఈ నియోజకవర్గంలో కీలక నేతలైన మర్రి రాజశేఖర్ , ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో విభేదాలు ఉండడంతోనే ఆమెను ఇక్కడి నుంచి మార్చి గుంటూరు వెస్ట్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు.

మంగళగిరి విషయానికొస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీకి , పదవికి రాజీనామా చేయడంతో గంజి చిరంజీవిని ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు.చిరంజీవి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం , మంగళగిరి టౌన్ లో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆర్కే ను తప్పించాలని ముందుగానే డిసైడ్ అయ్యారట.2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలిచారు.  ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో , అదే సామాజిక వర్గానికి చెందిన ఈవూరు గణేష్ ను రేపల్లె ఇన్చార్జిగా వైసిపి అధిష్టానం నియమించింది.

గణేష్ తల్లి ఈవూరు సీతారావమ్మ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా గెలవడంతో , ఇప్పుడు ఆమె కుమారుడు గణేష్ ను వైసిపి పోటీకి దించుతోంది.

తాజా వార్తలు