ఎవర్రా మీరంతా.. టికెట్ లేకుండా ఏసి భోగిని ఎక్కిన ప్రయాణికులు.. చివరకు..?!

తాజాగా భారతీయ రైల్వేకు( Indian Railways ) సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.మామూలుగా మనం రిజర్వేషన్ బోగీలలో ప్రయాణం చేయాలంటే కచ్చితంగా రిజర్వేషన్( Reservation ) చేపించుకొని వెళ్తాం.

 Viral Video Ticketless Passengers Encroaching Seats In Reserved Compartment Deta-TeluguStop.com

ఒకవేళ బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్టులో ఉన్నా కానీ.అప్పుడు రిజర్వేషన్ బోగీలో ఎక్కి ఆ తర్వాత టికెట్ కలెక్టర్ తో సంప్రదించి ఏదో ఒక సీట్ ఖాళీ ఉందో లేదో చూసుకొని మరి అందులో ప్రయాణం చేస్తాము.

కాకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇలాంటి టికెట్ తీసుకోకుండా కానీ ఏసీ బోగీలలో ఎక్కేసి ఎక్కడపడితే అక్కడ వారు కూర్చోవడం గమనించవచ్చు.

ఈ పరిస్థితిలో అచ్చం జనరల్ కంపార్ట్మెంట్ లో తరహాలో ఏసి భోగి( AC Compartment ) నిండిపోయింది.నిజానికి సెకండ్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ ప్రయాణం అంటే చాలా ఎక్కువగా టికెట్ ధర ఉంటుంది.అయితే ఈ వీడియో చూసిన తర్వాత టికెట్ లేనివారు ఆ ఏసీ బోగీలోకి ఎక్కిన తర్వాత చేసిన పనుల కారణంగా రైలులో టికెట్ కొని ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

ఈ వీడియోలో కనబడుతున్న రైలు కుంబ్ ఎక్స్ప్రెస్.టికెట్ లేకుండా ఎక్కిన ప్రయాణికులు రిజర్వేషన్ ఉన్న వారి వ్యక్తులను ఆక్రమించడం, వారితో గొడవలు పడడం,

అంతేకాకుండా వారిని వేదించడం.వారికి ఎక్కడే అవసరమైతే అక్కడ ఎమర్జెన్సీ చైన్లను( Emergency Chain ) లాగుతూ అక్కడివారిని భయభ్రాంతులకు లోను చేశారు.అయితే ఎక్కువ బాధిత ప్రయాణికులలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు.

అయితే ఓ ఐఏఎస్ అధికారి ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను( Railway Minister Ashwini Vaishnav ) ట్యాగ్ చేయగగా వెంటనే దీనిపై రైల్వే శాఖ స్పందించింది.ఆ తర్వాత రైల్వే శాఖ ఆ బోగిలోని ప్రయాణికుల పేర్లు, వారి పిఎన్ఆర్ నెంబర్లను తెప్పించి వెంటనే వాటికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube