అగ్ర రాజ్యమా...ఆవకాయబద్దా...ఒక్కో డొల్ల బయటపడుతోందిగా...!!!!

పేరుకే అగ్ర రాజ్యం.విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం రెండు చేతులు, పైకి లేపి కూర్చోవడం తప్ప ఏమి లేదు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

మనది అగ్ర రాజ్యమేనా అంటూ స్థానిక ప్రజలు సైతం కౌంటర్ లు వేసుకునే పరిస్థితికి చేరుకుంది.అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ వైరస్ తీవ్రత అత్యధికంగా ఉండటంతో అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.

కరోనా వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిన ట్రంప్ కరోనా సోకినా మొదటి రోజుల్లోనే మాస్కులు, శానిటైజేషన్లు అందరికి అందించలేక చేతులు ఎత్తేశారు.ప్రస్తుతం రోగుల సంఖ్య చైనాని దాటిపోతున్న పరిస్థితిలో అక్కడి డాక్టర్లు , నర్సులకి రక్షణ దుస్తుల కొరత ఏర్పడింది.

ఇప్పటికే ఒక్కో డొల్ల తనం బయట పెట్టుకుంటున్న అమెరికా అధ్యక్షుడు తాజాగా అక్కడి నర్సుల ఆందోళనలతో మరో సారి తన అసమర్ధ పాలనని బయటపెట్టుకున్నారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.

Advertisement

అగ్ర రాజ్యంలో కనీసం రోగులకి సేవ చేసే డాక్టర్లు, నర్సులకి రక్షణ కవచాలు ఇవ్వకపోతే వారు విధులు ఎలా నిర్వర్తిస్తారు అంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు.అమెరికా వ్యాప్తంగా మాస్కులు, గౌనులు , కళ్ళ అద్దాలు కొరత ఉందని బహిరంగంగానే నర్సులు తమ గోడు వెళ్లగక్కుకుంటున్నారు.పాత మాస్క్ లు రిసైకిల్ చేసుకుని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో మంది రోగులకి సేవలు చేయాల్సిన భాద్యత అధికంగా నర్సులపైనే ఉంటుంది అలాంటిది వారికే సరైన రక్షణ లేకపోతే ఇక రోగుల పరిస్థితి ఏమి గాను అంటూ నెటిజన్లు నర్సులకి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు