ఆర్‌ఆర్ఆర్ విషయంలో అత్యంత పెద్ద నిరాశ

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను బాహుబలి సినిమా తో పోల్చుకుంటూ వసూళ్ల విషయం లో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలను వసూలు చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా వసూళ్ల ను ఈ సినిమా బీట్‌ చేయడం లేదా రీచ్ అవుతుందని భావించారు.

కానీ అనూహ్యంగా ఈ సినిమా ఆ సినిమా వసూళ్ల కు చాలా దూరం గా నిలిచింది.ఆ మాటకొస్తే బాహుబలి 2 సినిమా యొక్క వసూళ్ల లో కనీసం 50 శాతం వసూలు కూడా దక్కించుకోలేక పోవడం తో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.750 కోట్ల వసూళ్లు ఇప్పటి వరకు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది.మరో 100 నుండి 150 కోట్ల వరకు ఈ సినిమా ఈ సినిమా రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

Ntr Ram Charan Fans Very Sad About Rrr Movie,rrr, Ntr, Ram Charan, Rajamoui, Rrr

ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల ను రాబట్టి లేకపోవచ్చు అంటూ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ యొక్క అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు అంటూ వారు మానసిక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కథ విషయంలో రాజమౌళి మరింత శ్రద్ధ కనబరిచి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Ntr Ram Charan Fans Very Sad About RRR Movie,RRR, Ntr, Ram Charan, Rajamoui, Rrr

కథ లేకపోవడం వల్లే సినిమా యొక్క ఫలితం దారుణంగా తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొందరు మాత్రం ఈ సినిమా ఫలితం విషయం లో చాలా సంతృప్తిగా ఉన్నారు.

ఒక ఇండియన్ సినిమా వేయి కోట్ల వసూలు చేయడం అంటే అత్యంత గొప్ప విషయం.అదే సినిమా ఏడు వందల కోట్లు వసూలు చేయాలన్నా కూడా మామూలు విషయం కాదు.

ఇప్పటి వరకు ఒకటి లేదా రెండు సినిమా లకు కూడా సాధ్యం కాలేదు.కనుక జక్కన్న కొత్త సినిమా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది కొందరి అభిప్రాయం.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు