ఎన్టీఆర్‌ "జై లవ కుశ" సినిమా కథ ఇదేనా?

టెంపర్ తో ట్రెండ్ మార్చి, సరికొత్త కథల్ని ఎంచుకుంటున్నాడు యంగ్ టైగర్.ప్రయోగాలు నిరుత్సాహపరచకుండా మంచి ఫలితాలని ఇస్తున్నాయి కూడా.

అందుకే అదే బాటలో పయనిస్తున్నాడు.మాస్ దర్శకుడు అయిన బాబితో కూడా రెగ్యులర్ కథను కాకుండా విభిన్న కాన్సెప్ట్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తాడని టాక్ నడుస్తూనే ఉంది.అందుకే ఈ మూవీకి "జై లవ కుశ" అని టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

అంటే, ఎన్టీఆర్‌ పోషించే మూడు పాత్రల పేర్లు జై, లవ, కుశ అన్నమాట.ఇక ఆసక్తికరమైన గాస్సిప్ ఏంటంటే, ఈ మూడు పాత్రల్లో రెండు పాజిటివ్ క్యారెక్టర్స్, ఒకటి నెగెటివ్ క్యారక్టర్ అంట.ఓరకంగా చెప్పాలంటే, హీరో తానే, విలన్ తానే.వింటుంటేనే ఇంత ఆసక్తికరంగా అనిపిస్తే, ఇక ఆ పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా పండించాక కథ ఇంకెంత ఆసక్తికరంగా అనిపిస్తుందో.

Advertisement
ఓకే టైటిల్ తో అక్కినేని, ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలు.. ఏది హిట్ ? ఏది ఫట్ ?

తాజా వార్తలు