NTR Mana Desam: ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ, ఆయన సినిమాలు రిలీజ్ చేసిన థియేటర్ల విశేషాలు తెలుసా..?

ఎన్టీఆర్ మనదేశం (1949)( Manadesam ) సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టారు.ఈ మూవీ విడుదలై రీసెంట్‌గా 74 ఏళ్లు పూర్తయ్యాయి.

ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్‌లో బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పోలీసు రోల్‌ను ఎన్టీఆర్( NTR ) పోషించారు.ఆ నవల మరేదో కాదు ప్రముఖ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రచించిన విప్రదాస్.

ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యానికి వ్యతిరేకంగా రాశారు.ఎన్టీఆర్ మనదేశం సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు.

కె.వి.రెడ్డి ఈ నటుడిని పాతాళ భైరవి సినిమాలో హీరోగా పెట్టి మూవీ తీశారు.ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఎన్టీఆర్ అనంతరం ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు.

Advertisement

సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా సూపర్ సక్సెస్ అయ్యారు.ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయి గొప్ప పరిపాలన అందించారు.1949 నవంబర్ 24న మనదేశం మూవీ బెజవాడ దుర్గాకళామందిరంలో( Durgakalamandiram ) విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ఆ తర్వాత ఈ హాలు నందే ఎన్టీఆర్ నటించిన ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యి వంద రోజులు ఆడాయి.

ఈ హాలు విజయా వాహినీ లీజులో ఉండటంవల్ల ఇందులోనే తన సినిమాలు రిలీజ్ కావడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు.

ఎన్టీఆర్ ప్రొడ్యూస్‌ చేసిన సినిమాలు కూడా విజయా వారే డిస్ట్రిబ్యూట్ చేశారు.అవి దుర్గాకళామందిరంలో విడుదలయ్యారు.దీనివల్ల ఆ హాలు ఎన్టీఆర్ సొంతమని చాలామంది అనుకునేవారు కానీ దీనిని ఆంధ్రపత్రికాధిపతి, అమృతాంజనము అధిపతి అయిన శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు నిర్మించారు.

మనదేశం రిలీజ్ అయిన సినిమా థియేటర్ల లిస్టులో తెనాలి సత్యనారాయణ థియేటర్( Satya Narayana Theater ) కూడా ఉంది.ఇప్పుడు అది కళ్యాణమండపంగా మారిపోయింది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఇకపోతే కృష్ణవేణి సమర్పణలో శోభానాచల పిక్చర్స్ బ్యానర్‌పై మీర్జాపూర్ రాజా సాహెబ్ నిర్మించారు.ఇందులో వి.నాగయ్య, సి.హెచ్.నారాయణరావు, కృష్ణవేణి కూడా నటించారు, ఘంటసాల సంగీతం సమకూర్చారు.

Advertisement

ఈ సినిమాలోని పాటలు కూడా బాగానే ఉంటాయి.మొత్తం మీద ఎన్టీఆర్ నటించడం వల్ల ఈ మూవీని ఇప్పటి తరం వారు కూడా ఒక్కసారైనా చూసే ఎంజాయ్ చేస్తుంటారు.

ఫస్ట్ సినిమాలోని ఎన్టీఆర్ చూపించిన నటన ప్రదర్శనకు ఫిదా అవుతుంటారు.నిజంగా ఎన్టీఆర్ లాంటివాడు ఇప్పటివరకు పుట్టలేదు మళ్ళీ పుట్టబోడు కూడా.

తాజా వార్తలు