అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరంపై జెండా పాతిన ఎన్ఆర్ఐ జంట

అమెరికాకు(Amarica) చెందిన సిక్కు దంపతులు హర్‌ప్రీత్ సింగ్ చీమా, నవనీత్ కౌర్ చీమాలు(Harpreet Singh Cheema ,Navneet Kaur Cheema) అరుదైన ఘనత సాధించారు.

అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరం ‘మౌంట్ విన్సన్’(Mount Vinson)పై నిషాన్ సాహిబ్ (సిక్కుల మతపరమైన జెండా)ను పాతిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు.

ఆ వెంటనే చీమా దంపతులు ‘‘ బోలే సో నిహాల్, సత్ శ్రీ అకల్ ’’ అంటూ నినాదాలు చేశారు.ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ జంట గతేడాది మే 23న ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ (8848 మీ)ను అధిరోహించారు.2019లో ఆఫ్రికాలోని (Africa)ఎత్తైన పర్వతం కిలిమంజారోను(Kilimanjaro) అధిరోహించిన తర్వాత చీమా దంపతుల ప్రయాణం మొదలైంది.అనంతరం 2022లో మౌంట్ ఎల్బ్రస్ , 2023లో మౌంట్ అకోన్కాగువా, 2023లో మౌంట్ డెనాలి పర్వతాలను అధిరోహించారు.

ప్రస్తుతం అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్‌ను కూడా పూర్తి చేయగా.ఇండోనేషియాలోని మౌంట్ పుంకాక్ జయ మాత్రమే మిగిలి ఉంది.పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన చీమా దంపతులకు దోబాతో అనుబంధం ఉంది.

Nri Couple Becomes First Sikh Pair To Scale Mt Vinson At Antarctica, Nri Couple,

మారథాన్‌లు, సైక్లింగ్, ట్రయాథ్లాన్‌లపై తమకున్న ఆసక్తి.పర్వతారోహణ వైపుకు నడిపించిందని వారు తెలిపారు.కొత్త సవాళ్లను అన్వేషించే మార్గంగా ప్రారంభమైన ఈ ప్రయాణం పర్వతాల పట్ల, ప్రకృతి పట్ల ప్రేమగా మారిందని హర్‌ప్రీత్ తెలిపారు.

Advertisement
NRI Couple Becomes First Sikh Pair To Scale Mt Vinson At Antarctica, NRI Couple,

అమెరికాలోని రెండవ అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధ అయిన స్ట్రాటజీ ఫర్ కామన్ స్పిరిట్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హర్‌ప్రీత్ పనిచేస్తున్నారు.నవ‌నీత్ కౌర్.ఎక్స్‌పీడియా గ్రూప్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు 15 ఏళ్ల కుమార్తె చానియా కౌర్ చీమా, 7 ఏళ్ల కుమారుడు హుక్మాయ్ సింగ్ చీమా.వీరిద్దరూ కూడా తమ తల్లిదండ్రులతో కలిసి హైకింగ్ ట్రిప్‌లను ఇష్టపడతారు.

Nri Couple Becomes First Sikh Pair To Scale Mt Vinson At Antarctica, Nri Couple,

విన్సన్ పర్వతాన్ని అధిరోహించడాన్ని ఓర్పుకు పరీక్షగా వారిద్దరూ చెబుతున్నారు.ఇందుకు శారీరక , మానసిక బలం రెండూ అవసరమని .ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలలో అత్యంత కఠినమైన శిఖరాలలో ఒకటిగా నిలిచిందని వారు తెలిపారు.బరువైన ప్యాక్‌తో ప్రతిరోజూ దాదాపు 3 వేల అడుగుల వరకు ఎక్కడం సవాల్ విసిరిందన్నారు.

థాయ్ అమ్మాయిలను వేధించిన ఇండియన్ టూరిస్టులు.. ఆపై ఏమైందో మీరే చూడండి..
Advertisement

తాజా వార్తలు