జ‌న‌సేన‌కు క్యాండెట్లు లేరోచ్‌.. చేతులెత్తేసిన ప‌వ‌న్‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చేతులుఎత్తేశారా?  అభ్య‌ర్థులు కూడా క‌రువ‌య్యారా?  అస‌లు జెండా మోసే నాథుడు కూడా క‌నిపించ‌డం లేదా? అంటే.

ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

పార్టీ పెట్టి.ఏడు సంవ‌త్స‌రాలుపూర్త‌యినా.

ఇప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ప‌వ‌న్ ఎక్క‌డా కృషి చేయ‌లేదు.పార్టీ పెట్టిన త‌ర్వాత ఇప్ప‌టికి రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చాయి.

అయితే. 2014 ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న జ‌న‌సేన‌.

Advertisement
No Candidates For Janasena Pawan Kalyan Gave Hand, Ap, Ap Political News, Latest

గ‌త 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్ర‌మే బ‌రిలో నిలిచింది.అయితే.

ఘోర ప‌రాజయం మూట‌గ‌ట్టుకుంది.ద‌రిమిలా పార్టీని అభివృద్ది చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, ప‌వ‌న్‌.పార్టీపై దృష్టి పెట్ట‌కుండా.

పొత్తుల కోసం వెంప‌ర్లాడారు.బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్ మీ డైట్ లో ఉండాల్సిందే..!

పోనీ.త‌ర్వా తైనా.

Advertisement

క్షేత్ర‌స్థాయిలో పార్టీని అభివృద్ధి చేసుకునేలా ముందుకు సాగారా? అంటే.అది కూడా క‌నిపించ‌లే దు.ఉన్న‌వారు కూడా పార్టీకి దూర‌మ‌య్య‌రు.దీంతో ఇప్పుడు.

ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనే.జ‌న‌సేన జెండా ప‌ట్టుకునేవారు క‌రువ‌య్యారు.ఇక‌, ప‌ల్లెలు, గ్రామాల సంగ‌తి మ‌రింత దారుణంగా ఉంది.

బీజేపీతో ప‌వ‌న్ క‌ల‌వ‌డాన్ని గ్రామీణ ప్ర‌జ‌లు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు., ముఖ్యంగా యువ‌త ఇప్ప‌టికీ.

ప‌వ‌న్‌లో హీరోను చూస్తున్నారే త‌ప్ప‌.రాజ‌కీయ నేత‌ను చూడ‌లేక పోతున్నారు.

ఈ ప‌రిణామం.ముందు ఉంచి ఉన్నా.

ప‌వ‌న్‌సీరియ‌స్ గా తీసుకోలేదు.

ఇక‌, ఇప్పుడు గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో ఎటు వైపు మొగ్గాలో అర్ధం కాని ప‌రిస్థితి వ‌చ్చింది.దీంతో ఆయ‌న ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి, ఎన్నిక‌ల‌క మిష‌న్‌కు మ‌ధ్య వివాదం త‌లెత్తినా.మౌనంగా ఉండి పోయారు.

ఇక‌, ఎన్నిక‌లు త‌థ్య‌మ‌ని తెలిసిన‌ త‌ర్వాత‌.అనూహ్య‌మైన కామెంట్ చేశారు.

యువ‌త ఎన్ని క‌ల్లో పాల్గొనాల‌ని.గ్రామాల‌ను అభివృద్ధి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.త‌న పార్టీ విష‌యానికి వ‌చ్చే స‌రికి.

మాత్రం భిన్న‌మైన వాద‌న లేవ‌నెత్తారు.ఎన్నిక‌ల్లో పోటీ చేసే యువ‌త‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని.

మ‌ద్ద‌తిస్తుంద‌ని అన్నారు.అంటే.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన త‌ర‌ఫున ఎవ‌రూ లేర‌నే విష‌యాన్ని ప‌వ‌న్ ఒప్పుకొన్న‌ట్టుగా నే భావించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీలకు లు.ఏద‌మైనా.వ్యూహం లేని అడుగులు జ‌న‌సేన‌ను నిలువునా ముంచాయ‌నే ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు