నాగార్జున డిజాస్టర్ సినిమా టైటిల్ తోనే.. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా?

సాధారణంగా ఇండస్ట్రీలో ఒకే టైటిల్ తో రెండు మూడు సినిమాలు రావడం చూస్తూ ఉంటాం.

ప్రస్తుతం ఒకప్పుడు మెగాస్టార్ పవర్ స్టార్ చేసిన సినిమాల టైటిల్స్ నే ఇక ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోలు తమ సినిమాలకు టైటిల్స్ గా పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

మరికొంత మంది ఎన్నో ఏళ్ల క్రిందట సినిమాల టైటిళ్లను మళ్లీ తమ సినిమాలకు పెట్టుకొని హిట్ కొడుతున్న వారు కూడా ఉన్నారు.ఇప్పుడు రజినీకాంత్ కూడా ఇలాంటి ఒక సినిమా చేయబోతున్నారట.

ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన పోతున్న రజినీకాంత్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ తగ్గేదే లేదు అంటున్నాడు.అయితే శంకర్ రజినీ కాంబినేషన్ లో వచ్చిన రోబో 2.0 తర్వాత రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలి, పేట, దర్బార్, పెద్దన్న లాంటి సినిమాలు వరుసగా డిజాస్టర్ గా మిగిలిపోయాయ్.అయినప్పటికీ ఇక ప్రేక్షకులకు మంచి విజయాన్ని అందించేందుకు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు అని తెలుస్తోంది.

ఇక స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.అట పాన్ ఇండియా లెవెల్ ఇక ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఇలా రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు నాగార్జున ఫ్లాప్ మూవీ టైటిల్ పెట్టబోతున్నాడట రజినీకాంత్.నాగార్జున కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచిన బాస్ అనే సినిమా టైటిల్ నే ఇక ఇప్పుడు రజినీకాంత్ తన సినిమాకు పెట్టబోతున్నాడట.ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారట.

ఇక ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ డిజాస్టర్ టైటిల్ తో సూపర్ స్టార్ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు