Pulsar Pro150 bike : కొత్త బజాజ్ పల్సర్ ఇండియాలో లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ P150ని ఇండియాలో రూ.1.

17 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో రిలీజ్ చేసింది.ఈ బైక్ సింగిల్-డిస్క్, ట్విన్-డిస్క్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

సింగిల్-డిస్క్ వేరియంట్‌లో సింగిల్ సీటు, ట్విన్-డిస్క్ వేరియంట్‌లో స్ప్లిట్ సీటు వస్తుంది.ఈ కొత్త బైక్ బై-ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో కొత్త ఏరోడైనమిక్ 3D ఫ్రంట్‌తో వస్తుంది.

బజాజ్ పల్సర్ P150 రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్ అనే కలర్‌ ఆప్షన్స్‌లో అందించబడుతుంది.ఈ బైక్ సీటు హైట్ 790 మిల్లీమీటర్ల కాగా దీనిని షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా రైడ్ చేయవచ్చు.

స్ప్లిట్ సీట్ వెర్షన్‌లో ముందు 260 మిమీ డిస్క్ యూనిట్, వెనుక 230 మిమీ డిస్క్ యూనిట్‌ను కంపెనీ ఆఫర్ చేసింది.ఇక సింగిల్ సీట్ వేరియంట్ ముందు 260మిమీ డిస్క్, వెనుక 130మిమీ డ్రమ్‌తో వస్తుంది.

Advertisement

అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, కొత్త మోనో-షాక్ రియర్ సస్పెన్షన్‌, ఇన్ఫినిటీ డిస్‌ప్లే కన్సోల్, యూఎస్‌బీ మొబైల్ ఛార్జింగ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ రీడౌట్, సింగిల్-ఛానల్ ABS వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఈ మోటార్‌సైకిల్‌ రెండు వేరియంట్స్‌లో అందించారు.పల్సర్ P150 కొత్త 149.68సీసీ ఇంజన్‌తో వస్తుంది.ఇది 8,500 ఆర్‌పీఎమ్ వద్ద 14.3 బీహెచ్పీ, 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 13.5 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ బైక్‌ను ఇప్పటికే కోల్‌కతాలో విడుదల చేయగా.

రాబోయే వారాల్లో దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు.

కెర్బ్ వెయిట్ 140 కిలోలు కాగా లీటర్ పెట్రోల్‌కి మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది ఇంకా తెలియ రాలేదు.దీనిలో 17 అంగుళాల టైర్లు ఇచ్చారు.

కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!
Advertisement

తాజా వార్తలు