మోత్కూర్ లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశంలో,రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పోచం భిక్షపతి అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని,ప్రభుత్వాలే చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి,వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు గుండు ప్రసాద్,నల్ల యాదగిరి, అనబత్తుల వెంకన్న,మంచే గోవర్ధన్,జిల్లా రవి,తాటి లక్ష్మణ్,మసురమ్ కృష్ణయ్య, గుర్రం అంబదాసు,జెల్ది సోమయ్య,బొల్లం చంద్రశేఖర్, ఆకుపత్ని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

Latest Video Uploads News