నరేష్ కి ఝలక్ ఇచ్చిన ఆయన మూడో భార్య..?

నరేష్ -పవిత్ర( Naresh Pavitra Lokesh ) కలసి నటించిన తెలుగు -కన్నడ ద్విభాషా చిత్రం మళ్లీ పెళ్లి .

( Malli Pelli Movie ) ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది.

ఎమ్‌ఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వనితా విజయకుమార్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా టీజర్ , ట్రైలర్ అన్ని కూడా నరేష్ -పవిత్ర నిజ జీవితాల్లో జరిగిన ఘటనలని పోలి ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి .ఇక శుక్రవారం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి.ఇంతలో సీన్ లోకి నరేష్ వైఫ్ రమ్య రఘుపతి( Ramya Raghupati ) వచ్చేసింది.

మళ్ళీ పెళ్లి మూవీ విడుదలకు వెంటనే ఆపేయాలంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.

తన ప్రతిష్ట ను కించ పరిచేలా మళ్ళీ పెళ్లి సినిమా ఉందని, వెంటనే ఈ సినిమా విడుదల ఆపాలి అంటూ పిటిషన్ వేసింది.దీంతో నరేష్- పవిత్ర లోకేష్- రమ్య రఘుపతి నడుమ నడుస్తున్న వ్యవహారాలు మరోసారి హాట్ ఇష్యూ అయ్యాయి.

Advertisement
Naresh Third Wife Ramya Raghupati Approached Court On Malli Pelli Movie Details,

నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో నెవర్ ఎండింగ్ టాపిక్ అయింది.ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన ఇష్యూస్ లో ఇదొకటి.సరిగ్గా ఈ తరుణంలో ఆ ఇద్దరే మళ్ళీ పెళ్లి అనే సినిమా చేయడం ఆసక్తికరం.

పవిత్ర లోకేష్‌తో కలిసి నరేష్ సహజీవనం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతుండగా.ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి సినిమా కంప్లీట్ చేశారు.

Naresh Third Wife Ramya Raghupati Approached Court On Malli Pelli Movie Details,

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సడెన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది.విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట.

ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం.సురేష్ బొమ్మిలి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నరేష్, పవిత్ర లోకేష్ లీడ్ రోల్స్ పోషించారు.

Naresh Third Wife Ramya Raghupati Approached Court On Malli Pelli Movie Details,
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచేశాయి.సిచుయేషన్ క్యాచ్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.రీసెంట్ గా వదిలిన ఈ మూవీ టీజర్ లో పవిత్రను నరేష్ లిప్ కిస్ చేసిన సీన్ కూడా ఉండటంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగింది.

Advertisement

నరేష్ జీవితంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ టీజర్ ద్వారా ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.మరి ఇప్పుడు మూడో భార్య రంగంలోకి దిగడంతో ఏమి జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది .

తాజా వార్తలు