సస్పెన్స్ థ్రిల్లర్‌గా నాని మూవీ

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని తన నెక్ట్స్ చిత్రాలను క్యూలో పెడుతున్నాడు.ఇప్పటికే శివ నిర్వాణ డైరెక్షన్‌లో టక్ జగదీష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నాని, ఆ తరువాత టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాకు ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఎలాంటి జోనర్‌లో తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఉండే ట్విస్టులు ప్రేక్షకులను మెప్పిస్తాయని , ఇక నాని పాత్ర ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమా షూటింగ్‌ను ఆగష్టు నుండి మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు